వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: గుడ్‌న్యూస్, కరోనాకు మందు, కనుక్కొన్న అంటోన్న బెంగళూరు వైద్యుడు..? (వీడియో)

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. నివారణ మందు లేకపోవడంతో.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే కరోనాకు మందు కనుగొన్నానని బెంగళూరుకు చెందిన వైద్యుడు విశాల్ రావు తెలిపారు. కానీ అది ఫస్ట్ స్టేజీలో ఉందని వివరించారు. ప్రజల ప్రాణాలను తోడేస్తున్న కరోనాకు మందు కనుక్కొన్నామని చెప్పడంతో.. కాస్త ఊరట కలిగింది. కానీ దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చి, పరిశోధన జరిగితే గానీ అందుబాటులోకి రాదు.

బెంగళూరుకు చెందిన విశాల్ రావు అంకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్‌కు మందు కనుక్కొన్నామని పేర్కొన్నారు. వైరస్ ప్రబలిన రోగుల్లో సైటోకిన్‌‌ను రోగుల్లో ఇంజెక్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఇది వైరస్ నిర్మూలన ప్రారంభ దశ అని.. వారంలోగా తుది దశకు చేరుకుంటామని వివరించారు. వైరస్ నివారణ మందు పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశానని ఆయన వివరించారు.

bangalore doctor invented for covid-19 medicine..?

ఏదీ ఏమైనప్పటికీ కరోనా వైరస్ కోసం మందు కనుక్కొనే అడుగు పడటం శుభ పరిణామం. దీనికి ప్రభుత్వం అనుమతిచ్చి.. పరిశోధనలు చేస్తే, వైరస్‌కు విరుగుడు మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు వైరస్ ప్రబలిని వారిని వ్యాధి నుంచి నయం చేసే వెసులుబాటు రానుంది. విశాల్ రావు ప్రయోగం విజయవంతం కావాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నారు. అతనికి సపోర్ట్ చేసేందుకు మిగతా వైద్యులు కూడా ముందుకురావడం ఆరోగ్యకర వాతావరణం తెలియజేస్తున్నది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

English summary
bangalore doctor vishal rao invented for covid-19 medicine..?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X