బెంగళూర్ రేప్: హైదరాబాదీలపై ఫిర్యాదు, రెడ్డి అరెస్టు

ఈ పాఠశాలతో పాటు మరో మూడింటిని నడుపుతున్న గౌతం అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డిపై విద్యాశాఖ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ హెచ్‌బి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రెడ్డిని అరెస్టు చేశారు.
నిబంధనలను ఉల్లంఘించి సిబిఎస్ఇ ఇంగ్లీష్ మీడియా స్కూల్‌ను ఆ సంస్థ నడుపుతోందని, తద్వారా ప్రజలను, తల్లిదండ్రులను, ప్రత్యేకంగా 900 మందికి పైగా పిల్లలను మోసం చేసిందని, దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ అనుమతి లేదని అధికార వర్గాలు చెప్పాయి.
సంబంధిత శాఖ అధికారులు పాఠశాలను తనిఖీ చేశారని, సొసైటీకి కన్నడ మాధ్యమంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నడపుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం నిరుడు మార్చి 25వ తేదీన అనుమతి ఇచ్చిందని, ఆ విషయం అప్పటి తనిఖీలో తేలిందని ఆ వర్గాలు చెప్పాయి. అయితే, పాఠశాల సిబిఎస్ఇ సిలబస్ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రీ నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు నడుపుతోందని ఆ వర్గాలు ఆరోపించాయి.
విద్యాశాఖ నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. వారంతా హైదరాబాదుకు చెందినవారే. ట్రస్టు అధ్యక్షురాలు కె. దుర్గ, ఉపాధ్యక్షురాలు వై. శిల్ప, ప్రధాన కార్యదర్శి కెఆర్‌కె రెడ్డి, సంయుక్త కార్యదర్శి సురేంద్రబాబులపై ఫిర్యాదు చేశారు. రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా ముగ్గురికి సమన్లు జారీ చేశారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications