భారత్ లో బంగ్లా హిందువుల వ్యధ-స్వదేశంలో తాజా చిచ్చుపై ఆందోళన..!
పొరుగుదేశం బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై చోటు చేసుకుంటున్న హింస భారత్ లో ఎప్పుడో విభజన సమయంలో శరణార్థులుగా తరలివచ్చేసిన వారిలో ఆందోళన రేపుతోంది. అప్పట్లో లక్షలాదిగా భారత్ కు తరలివచ్చిన హిందువులు దేశంలోనిపశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం మరియు మేఘాలయ రాష్ట్రాలలో ఆశ్రయం పొందారు. ఇందులో చాలా మంది తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలనే ఆశతో వచ్చినా వారికి శాశ్వత శరణార్థి పేరు మాత్రం తప్పలేదు. ఇప్పుడు వారంతా బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళనగా ఉన్నారు.
రజాకార్లు మాపై దాడి చేశారు
తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ లోని బంగ్లా శరణార్థులు .. గతంలో పాకిస్తాన్ లో భాగంగా ఉన్నప్పుడు తమ వారిపై జరిగిన దురాగతాలను గుర్తుచేసుకుంటున్నారు. గతంలో 1971లో బంగ్లా ఏర్పాటు సమయంలో భారత్ కు పారిపోయి వచ్చిన సుశీల్ గంగోపాధ్యాయ.. అప్పట్లో అక్కడి నోఖాలీ జిల్లాల్లో తాము గడిపిన సంపన్న జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. తమది పెద్ద కుటుంబమని, విస్తారమైన భూములున్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. కానీ బంగ్లా విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం , రజాకార్లు తమపై దాడి చేశారని , ఇళ్లు తగులబెట్టబడ్డారని, ఆ దాడుల్లో చాలా మందిని క్రూరంగా చంపేసారని తెలిపారు.

ఇప్పుడు బంగ్లాదేశ్ లో కనిపిస్తున్న ఘటనలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీని కడుపులో తన్నిన దృశ్యాలు చూశానని, ఇలాంటి క్రూరత్వం ఊహించలేమన్నారు. ఒక భారతీయుడిగా వారిని రక్షించాలని కోరారు. బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. తిరిగి క్విట్ ఇండియా తరహా ఉద్యమం గుర్తుచేసుకోవాల్సి వస్తుందని ఆయన చెప్తున్నారు. అప్పట్లో రజాకార్లు పురుషుల శరీరాలను నదులలో విసిరి, తమ తల్లుల్ని చెరిచారని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో పాకిస్తాన్ సైన్యం చాలా మంది బంగ్లా మహిళల్ని గర్భం దాల్చేలా చేసిందన్నారు.
హిందువులు భారత్‌కు వచ్చేయాలి..
బంగ్లాదేశ్ పారిపోయినప్పుడు గర్భవతి అయిన బంగావ్‌కు చెందిన అనిమా దాస్ వ్యథ కూడా ఇలాంటిదే. అప్పట్లో తన కొడుకు చిన్నవాడని, తన కుమార్తె నా కడుపులో ఉందని ఆమె తెలిపారు. దేశం ఘర్షణలో మునిగిపోయిందని, ఇళ్ళు తగలబడ్డాయని గుర్తుచేసుకున్నారు. భయంతో తన అత్తగారు భారతదేశానికి పంపారన్నారు. అప్పట్లో జరిగిన దాడులతో ఆ తర్వాత బంగ్లాకు వెళ్లినా అక్కడ ఉండాలనిపించలేదని తెలిపారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో దాడుల్ని వాటితో పోలుస్తూ అక్కడి హిందువులు భారత్ కు వచ్చి ఆశ్రయం పొందాలని సూచిస్తున్నారు.

భయం గుప్పిట్లో హిందూ సమాజం
బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన తండ్రి రష్మోయ్ బిస్వాస్ వన్ఇండియాతో మాట్లాడుతూ.. హింసాత్మక స్వభావం హిందూ సమాజాన్ని నిరంతరం భయంతో ఉంచుతోందని, చాలా మంది తమ మాతృభూమిని విడిచిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందవలసి వస్తుందని గుర్తుచేసుకున్నరు. హిందువులు ఎప్పటి నుంచో బంగ్లాదేశ్‌లో సవాళ్లను ఎదుర్కున్నారని, స్వాతంత్ర్యం వచ్చిన సమయం నుంచీ విముక్తి యుద్ధం వంటి సవాళ్లు ఎన్నో ఎదుర్కున్నారని తెలిపారు.

1956లో భారతదేశానికి వచ్చిన పరేష్ దాస్ కూడా ఓ బాధాకరమైన అనుభవాన్ని వెల్లడించారు. తన కళ్ల ముందే తాతయ్యను నరికి చంపారని, భయంతో తమ భూమిని వదిలేశామని తెలిపారు.

తన కళ్లముందే కజిన్‌పై దాడి చేశారని, ప్రస్తుతం భారతదేశంలో శాంతియుతంగా జీవిస్తున్నప్పటికీ నోఖాలీలో ఉన్న బంధువులు బెదిరింపులకు గురవుతున్నారని తెలిపారు. నెల రోజుల క్రితం భూ తగాదాల కారణంగా తన మావయ్య హత్యకు గురయ్యాడని వెల్లడించారు.












Click it and Unblock the Notifications