వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాంగ్ కాంగ్: రూ. 6 వేల కోట్ల బ్లాక్ మని!

|
Google Oneindia TeluguNews

ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి విదేశాలకు వెళ్లిన బ్లాక్ మని కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఆదివారం సీబీఐ అధికారులు బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలపై దాడులు చేసి పలు కీలక సమాచారం సేకరించారు.

బ్లాక్ మని విదేశాలకు తరలించడానికి సహకరించారని ఆరోపిస్తు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. ఆదివారం సీబీఐ అధికారులు ముంబై లోని అశోక్ విహార్ శాఖలో దాడులు చేసి 60 బ్యాంకు అకౌంట్స్ పరిశీలించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 6,100 కోట్ల బ్లాక్ మనిని హాంగ్ కాంగ్ కు తరలించారని ఆదారాలు సేకరించారు. సీబీఐ దాడుల అనంతరం ఢిల్లీకి చెందిన ఓ శాఖలో పని చేస్తున్న ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేశామని బ్యాంకు ఆఫ్ బరోడా ప్రకటించింది.

Bank of Baroda: suspected money laundering involving some 60 billion rupees.

ఈ విషయంపై బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ అధికారి బి.బి. జోషి మాట్లాడుతూ - సీబీఐ అధికారులు అనుమానంతో 59 బ్యాంకు అకౌంట్స్ పరిశీలించారని, వాటి వివరాలు సేకరించారని అన్నారు. నియమాల ప్రకారం ట్యాక్స్ చెల్లించుకుని హాంగ్ కాంగ్ లోని 50 కంపెనీలకు నగదు బదిలి చేశామని అన్నారు.

అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా పై సీబీఐ అధికారులు దాడులు చెయ్యడం, ప్రత్యేక దర్యాప్తు పోలీసు బృందం పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో సోమవారం ఆ బ్యాంకు షేర్ ల మీద దెబ్బపడింది.

English summary
Bank of Baroda said on Monday it had suspended two senior bank employees at one of its branches in Delhi as part of a police investigation into suspected money laundering involving some 60 billion rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X