మరోసారి, ట్యాక్సీ డ్రైవర్ ఖాతాలోకి రూ.999 కోట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ బల్వీందర్ సింగ్ ఖాతాలో మరోసారి పెద్ద మొత్తంలో డబ్బులు పడ్డాయి. ఇటీవల బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అతడి ఖాతాలో రూ.9806 కోట్లు పడ్డాయి. ఆ తరవాత బ్యాంకు అధికారులు తప్పును గుర్తించి సరి చేశారు.


కూలీ అకౌంట్‌లో రూ.10వేల కోట్లు పడ్డాయి! ఎలా వచ్చాయి?

ఇది మరువక ముందే మళ్లీ అదే ట్యాక్సీ డ్రైవర్ బల్వీందర్ ఖాతాలో ఈసారి రూ.999 కోట్లు పడ్డాయి. నవంబర్‌ 19న ఖాతాలో రూ.167 జమ అయినట్లు ఆయనకు ఫోన్ సందేశం వచ్చింది. కానీ బ్యాంక్‌ బ్యాలన్స్‌ చూస్తే మాత్రం రూ.999 కోట్లు ఉన్నట్లు కనిపించింది.

Bank errs, taxi driver turns billionaire twice

దాంతో బల్వీందర్‌ మళ్లీ బ్యాంక్‌కు వెళ్లి అధికారులకు జరిగింది చెప్పాడు. గతంలో వలె, ఈసారి కూడా పొరపాటే జరిగిందని ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని అధికారులు తాత్కాలికంగా అతని బ్యాంక్‌ ఖాతాను మూసివేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bank errs, taxi driver turns billionaire twice.
Please Wait while comments are loading...