
అవమానించాడని తుపాకీతో కాల్పులు జరిపిన బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్: ప్రెస్ రివ్యూ

ఒక బ్యాంక్ సెక్యూరిటీ గార్డు తనను అవమానిస్తున్నాడని ఒక ఉద్యోగిపై కాల్పులు జరిపినట్లు ఈనాడు వార్తా పత్రిక కథనం ప్రచురించింది.
హైదరాబాద్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కార్యాలయంలో కాల్పుల ఘటన బుధవారం కలకలం సృష్టించింది.
సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న మహ్మద్ సర్దార్‌ఖాన్ పొరుగుసేవల ఉద్యోగి సురేందర్‌పై మూడురౌండ్లు కాల్పులు జరిపాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో రాజధాని నగరం ఉలిక్కిపడింది.
నగరంలోని గన్‌ఫౌండ్రీలో గల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో రోజువారీగా మధ్యాహ్నం రెండు గంటలకు ఖాతాదారుల సేవలు పూర్తయ్యాయి.
బ్యాంకు అధికారులు, సిబ్బంది వారి పనులు చేసుకుంటున్నారు. భద్రతా విధులు నిర్వహిస్తున్న సర్దార్ ఖాన్(54) తనకు కేటాయించిన గదిలో ఉన్నాడు.
మధ్యాహ్నం 3.10గంటలకు సురేందర్(58) సర్దార్ ఖాన్ వద్దకు వచ్చాడు. ఏదో విషయమై ఇద్దరూ వాగ్వాదానికి దిగారు.
ఆగ్రహంతో ఊగిపోయిన సర్దార్ ఖాన్ తన వద్ద ఉన్న సింగిల్ బ్యారెల్ పంప్ షాట్‌గన్‌ను సురేందర్‌పైకి ఎక్కుపెట్టి కాల్చాడు.
సురేందర్ తప్పుకోగా వరుసగా మూడు రౌండ్లు కాల్చాడు. రెండు తూటాలు గోడకు తగలగా.. ఒకటి సురేందర్ ఛాతీకింద భాగంలో దూసుకెళ్లింది.
రక్తస్రావమవడంతో అక్కడున్న ఉద్యోగులు అతడిని బయటకు తీసుకువచ్చారు. మరికొందరు సర్దార్ ఖాన్‌ను పట్టుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సురేందర్‌ను హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అతడికి ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు.
నిందితుడిని అరెస్ట్ చేసినట్లు, అతడిపై హత్యాయత్నం, ఆయుధ దుర్వినియోగ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సంయుక్త కమిషనర్ పి.విశ్వప్రసాద్ తెలిపారు.
'నువ్వు అధికారుల చెంచా.. ఎప్పుడూ వాళ్ల కాళ్లు నాకుతుంటావ్' అంటూ సురేందర్ తనను రోజూ అవమానిస్తుండడంతో తట్టుకోలేక కాల్చానంటూ సర్దార్ ఖాన్ పోలీసుల విచారణలో చెప్పాడని ఈనాడు వివరించింది.
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?

ఏపీలో టెన్త్ ఫలితాల ఫార్ములా రెడీ
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలకు సంబంధించిన ఫార్ములా సిద్ధమైనట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్త ప్రచురించింది.
కరోనా కారణంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దయిన నేపథ్యంలో.. ఇంటర్నల్ పరీక్షల మార్కుల మదింపు విధానం కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఎం.ఛాయారతన్ నేతృత్వంలో నియమించిన కమిటీ బుధవారం సమావేశమై దీనికి సంబంధించిన తుది ఫార్ములాను రూపొందించింది.
కమిటీ తన నివేదికను గురువారం పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌కు సమర్పించనుంది.
ఆ తర్వాత మార్కుల మదింపు ఫార్ములా, గ్రేడింగ్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారు.
2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన రెండు ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ) పరీక్షల మార్కులను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఫార్ములాను తయారుచేశారు.
ఎఫ్‌ఏ-1 పరీక్ష.. రాత పరీక్ష(స్లిప్ టెస్ట్) 20 మార్కులకు, విద్యార్థికి సంబంధించిన మూడు వ్యక్తిగత నైపుణ్యాలకు ఒక్కొక్క దానికి 10 మార్కుల చొప్పున 30 మార్కులకు కలిపి మొత్తంగా(20+30) 50 మార్కులకు నిర్వహించారు.
దీని ఆధారంగా.. విద్యార్థి రాత పరీక్షలో 20 మార్కులకు సాధించిన మార్కులను 70 శాతంగా, మిగిలిన మూడు అంశాలలో కలిపి సాధించిన 30 మార్కులకు 30 శాతంగా పరిగణించాలని కమిటీ నిర్ణయించింది.
ఈ 100 శాతాన్ని తిరిగి 50 మార్కులకు కుదించి నమోదు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎఫ్‌ఏ-2 నుంచి కూడా 50 మార్కులకు లెక్కించనున్నారు.
ఈ రెండు ఎఫ్‌ఏ(50+50) పరీక్షల్లో విద్యార్థికి వచ్చిన మార్కులతో గ్రేడింగ్‌లు ఇస్తూ తుది ఫలితాన్ని ప్రకటిస్తారని పత్రిక రాసింది.
పదో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ పరీక్షల్లో సాధించిన మార్కులకు నిర్దేశించిన ఫార్ములా మేరకు ఏ1, ఏ2, బీ1, బీ2, సీ1, సీ2, డీ1, డీ2 గ్రేడ్లు ఇస్తారు.
ఈ-గ్రేడ్‌తో మిగిలిన వాళ్లనూ పాస్ చేస్తారు. ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయరని ఆంధ్రజ్యోతి వివరించింది.
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

ఏపీలో విద్యతోపాటు ఉద్యోగాల్లోనూ 'ఈడబ్ల్యూఎస్' రిజర్వేషన్లు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యావకాశాలతోపాటు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
దానికి కొనసాగింపుగా ఉద్యోగావకాశాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని సాక్షి చెప్పింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీలలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8 లక్షల లోపు ఉండాలి.
ఈడబ్ల్యూఎస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించే పది శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారని సాక్షి వివరించింది.
- ఎర్రబెల్లి దయాకర రావు: మహిళా ఎంపీడీవోతో వివాదాస్పద వ్యాఖ్యలు, మంత్రి అలా మాట్లాడొచ్చా అని విమర్శలు
- టోక్యో ఒలింపిక్స్: సానియా మీర్జా ఈసారి పతకం సాధిస్తారా
తెలంగాణలో ఉద్యోగాల ఖాళీలపై 5 రోజుల్లో వివరాలు
విభాగాలవారీగా ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను రాష్ట్ర క్యాబినెట్ ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన జరగాలని, జిల్లాలవారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయటానికి చర్యలు తీసుకోవాలని కేబినెట్ స్పష్టంచేసింది.
బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చించారని పత్రిక రాసింది.
సమాజంలో, ఉద్యోగరంగాల్లో చోటుచేసుకొంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన అవసరమని, ఇందుకోసం కొత్త పోస్టులను సృష్టించాల్సిన అవసరం ఉన్నదని క్యాబినెట్ అభిప్రాయపడింది.
అదే సందర్భంలో కాలంచెల్లిన పోస్టులు అవసరంలేదని.. ఉద్యోగ వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోవాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, అధికారులను ఆదేశించింది.
అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి, జిల్లాలు, విభాగాలవారీగా సంకలనం చేయాలని సూచించింది.
బుధవారం నాటి మంత్రివర్గ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగులు, ఖాళీల వివరాలను క్యాబినెట్ ముందుంచారు.
ప్రతి విభాగంలో మంజూరైన పోస్టుల సంఖ్య, వివిధ క్యాటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అందించారని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తాలిబన్ గురించి భారత్ సహా ఈ ఏడు దేశాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి
- జమాల్ ఖషోగ్జీ హత్య: సౌదీ ప్రిన్స్ విషయంలో అమెరికా మెత్తబడిందా?
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- పోకిరీల వేధింపులపై మహిళల వినూత్న పోరాటం
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- ఝార్ఖండ్ మూక హత్య: 'మా అల్లుడి మరణంతో నా బిడ్డ జీవితం నాశనమైంది'
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి" - పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)