Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిగ్గుండాలి.. ఈఏంఐ కట్టలేదని ఓ వ్యక్తి భార్యతో.. బ్యాంక్ స్టాఫ్ నీచమైన పని !

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు.. అమానవీయంగా వ్యవహరించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈఎంఐ చెల్లించలేదన్న కారణంగా ఒక వ్యక్తి భార్యను బలవంతంగా బందీగా ఉంచిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కోటాను కోట్లు రుణాలు తీసుకున్న బడా బాబుల విషయంలో మాత్రం ఓ రకంగా వ్యవహరించే బ్యాంకులు.. సాధారణ ప్రజల పట్ల ఈ రకంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగిందంటే..?

పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రవీంద్ర వర్మ.. తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. బమ్రౌలి లోని ఆజాద్ నగర్లో ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులో రూ. 40,000 వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా రూ. 2,120 ఈఎంఐ చెల్లిస్తున్న రవీంద్ర.. ఇటీవల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కొన్ని వాయిదాలు చెల్లించలేకపోయాడు.

bank-staff-hostage-mans-wife-for-not-paying-emi-in-uttar-pardesh

భార్యను బందీగా ఉంచి డబ్బు చెల్లించాలని డిమాండ్..

ఈ క్రమంలోనే గత సోమవారం, ఈఎంఐల గురించి మాట్లాడటానికి రవీంద్రను బ్యాంకుకు రావాలని ఉద్యోగులు పిలిపించినట్టు సమాచారం. తన భార్య పూజ వర్మతో కలిసి బ్యాంకుకు వెళ్లిన రవీంద్రకు అక్కడ ఊహించని షాక్ ఇచ్చారు సిబ్బంది. పూజను బలవంతంగా బ్యాంకు లోపల కూర్చోబెట్టి.. బాకీ మొత్తం చెల్లించే వరకు ఆమెను వదిలిపెట్టబోమని చెప్పినట్టు ఆరోపిస్తున్నారు.

"ఇంటికి వెళ్లి డబ్బు తీసుకుని వచ్చి, మీ భార్యను ఇక్కడి నుండి తీసుకెళ్లండి" అంటూ బెదిరించినట్టు చెబుతున్నారు. ఎంత వేడుకున్నా, డబ్బును వెంటనే ఏర్పాటు చేయలేనని చెప్పినా.. బ్యాంకు ఉద్యోగులు వినిపించుకోలేదు రవీంద్ర వాపోతున్నారు. దాంతో డయల్ 112 కు ఫోన్ చేసి పోలీసులకు ఆయన సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బ్యాంకు ఉద్యోగుల నిర్బంధం నుంచి పూజ వర్మను విడిపించారు. దాదాపు 4 గంటల పాటు తన భార్యను బందీగా ఉంచారని రవీంద్ర వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.

bank-staff-hostage-mans-wife-for-not-paying-emi-in-uttar-pardesh

ఈ ఘటనతో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. రవీంద్ర వర్మ ఇప్పటివరకు 11 వాయిదాలు జమ చేశానని.. కానీ బ్యాంకులో మాత్రం కేవలం 8 వాయిదాలు మాత్రమే చూపించారని వాపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమానుష చర్యలకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు లోన్ యాప్‌ల వేధింపులు కారణంగా ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజలను మైక్రోఫైనాన్స్ సంస్థలు, డబ్బు అప్పు ఇచ్చే ఏజెన్సీలు, లోన్ యాప్‌ల బలవంతపు వసూళ్ల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష.. రూ. ఐదు లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ తరహా చట్టాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+