వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్ 1 నుంచి.. శనివారాలు బ్యాంకులు మూత నిజమేనా?

బ్యాంకులకు జూన్ 1 నుంచి ఐదు పనిదినాలు మాత్రమే ఉండనున్నాయని, ప్రతి శనివారం బ్యాంకులకు సెలవని ఇటీవల వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఇది ఎంత వరకు నిజం?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై : బ్యాంకులకు జూన్ 1 నుంచి ఐదు పనిదినాలు మాత్రమే ఉండనున్నాయని, ప్రతి శనివారం బ్యాంకులకు సెలవని ఇటీవల వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదట. దీంతో ఇది కేవలం తప్పుదోవ పట్టించే మెసేజ్ మాత్రమేనని వెల్లడవుతోంది.

సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇటీవల విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత నగదు విషయంలో, మిగతా ఆదేశాల విషయంలో ఆర్బీఐ ప్రకటించకున్నా.. ప్రజల్లో భయాందోళన కలిగించే మెసేజ్ లు కొందరు పంపుతున్నారు.

 Banks will not be closed all Saturdays

ఇలాంటి మెసేజ్ లు పంపే ముందు ఒక్కసారి రిజర్వు బ్యాంకు అధికారిక ప్రకటనను చెక్ చేసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకులు కేవలం రెండో, నాలుగో శనివారం మాత్రమే సెలవు దినాలను పాటించనున్నాయి.

2015 ఆగస్టు నుంచి బ్యాంకులు ఈ సెలవును పాటిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నుంచి అధికారికంగా వార్త వెలువడే వరకు ఈ పద్ధతినే బ్యాంకులు పాటించనున్నాయి.

English summary
CHENNAI: A message going viral on WhatsApp claims that banks will remain closed on all Saturdays starting from June 1 this year. However, there has been no intimation from the RBI regarding any official announcement to this effect. The message, doing several rounds on social media platforms, has capitalised on the vulnerability of the masses still reeling under the effects of demonetisation. As this is not the first time misleading information has been shared on social media, people are advised to check the veracity of the information shared before passing it on. It would also do well to check for an official announcement in such matters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X