పవన్ కు అస్వస్థత, కేబినెట్ భేటీ మధ్యలోనే...!?
డిప్యూటీ సీఎం పవన్ కేబినెట్ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఉదయం కేబినెట్ భేటీకి హాజరైన పవన్.. సమావేశం జరుగుతున్న సమయంలో అసౌకర్యంగా కనిపించారు. గతం లో వలే తీవ్ర వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడ్డారు. దీంతో, ఆయన సమావేశంలో మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయంకు వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు గా తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు.. పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చగా మారాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఏపీ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ ఈ రోజున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసారు. కీలక అంశాల పైన చర్చించేలా అజెండా సిద్దం అయింది. కేబినెట్ భేటీకి హాజరైన పవన్.. సమావేశం ప్రారంభం అయిన దాదాపు గంట సమయం తరువాత మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అయితే, ఇందు కు కొంత ఆరోగ్య పరమైన సమస్యలతోనే వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ వెన్నునొప్పితో బాధ పడ్డారు. తిరిగి చికిత్స తరువాత కోలుకున్నారు. ఇప్పుడు తిరిగి వెన్ను నొప్పి కారణంగా పవన్ కేబినెట్ సమావేశంలో ఇబ్బంది పడటంతో... బయటకు వెళ్లిపోయారని తెలుస్తోంది. మంగళగిరి వద్ద పార్టీ కార్యాలయంలో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ తన పార్టీ సమావేశం హైదరాబాద్ లో నిర్వహణకు సిద్దమయ్యారు. ఆ సమయంలో కొందరు పవన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వీటికి పవన్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. పవన్ సమాధానం.. వ్యాఖ్యలను తెలంగాణ నేతలు కౌంటర్ చేసారు. కాగా.. పవన్ తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇక.. ఈ రోజు కేబినెట్ భేటీతో పాటుగా ఎన్డీఏ పార్టీల సమన్వయ భేటీకి పవన్ హాజరు కావాల్సి ఉంది. ఈ సాయంత్రం సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు తో పాటుగా SIR పైనా చర్చించనున్నారు. నియోజకవర్గ స్థాయిలోనూ మూడు పార్టీల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications