వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దు ఎఫెక్ట్ ,రెండు రోజుల పాటు అంత్యక్రియలు వాయిదా

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావంతో రెండు రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించకుండా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మున్నీలాల్ అనే కూరగాయల వ్యాపారి తన భార

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం అంత్యక్రియలపై పడింది. చేతిలో నగదు లేని కారణంగా మృతదేహన్ని కూడ అక్కడే ఉంచారు. రెండు రోజుల పాటు అంత్యక్రియలు చేయకుండా వాయిదావేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం పెళ్ళిళ్ళే కాదు, చావులపై కూడ ప్రభావం కన్పిస్తోంది.బ్యాంకులో డబ్బున్న ఆ డబ్బును తీసుకొనే పరిస్థితి లేని కారణంగా అంత్యక్రియలను రెండు రోజుల పాటు వాయిదా వేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది. ప్రత్యేక పరిస్థితులను వివరించినా బ్యాంకు అధికారులు కనికరం చూపలేదు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మున్నీలాల్ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నాడు. భార్యకు క్యాన్సర్ వ్యాధి సోకింది. ఈ వ్యాధితో ఆమె సోమవారం నాడు మరణించింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు మున్నీలాల్ వద్ద చేతిలో చిల్లగవ్వలేదు. తనతో పాటు తన కొడుకు ఖాతాలో 16 వేల రూపాయాలు ఉన్నాయి. ఈ నగుదను బ్యాంకు నుండి డ్రా చేస్తేనే మున్నీలాల్ తన భార్య పూల్ మతి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

 banned currency effect cremeation postponed two days

సోమవారం నాడే మున్నీలాల్ బ్యాంకుకు వెళ్ళాడు. అయినా ఆయనకు నగదు అందలేదు. బ్యాంకు మేనేజర్ శిశుపాల్ ను కలిసి తన భార్య అంత్యక్రియలు నిర్వహించేందుకు గాను డబ్బులను ఇవ్వాలని కోరాడు. అయితే బ్యాంకులో నగదు లేదని ఆయన చెప్పాడు. ప్రత్యేక పరిస్థితులు వివరించాడు. తాను ఏమీ చేయలేనని భ్యాంకు మేనేజర్ చేతులెత్తేశాడు. మంగళవారం నాడు కూడ ఆయన బ్యాంకు వద్ద డబ్బుల కోసం లైన్ లో ఉన్నాడు. తన భార్య మృతదేహాన్ని పుట్ పాత్ వద్దే ఉంచాడు. ఈ విషయం తెలుసుకొన్న మీడియా ప్రతినిధులు బ్యాంకు మేనేజర్ ను కలిసి వివరించారు.. స్థానిక నాయకులు కూడ బ్యాంకు మేనేజర్ తో మున్నీలాల్ కు డబ్బులు ఇవ్వాలని కోరారు.

మీడియాతో పాటు స్థానిక నాయకులు బ్యాంకు మేనేజర్ ను కోరితే ఆయన దిగివచ్చాడు. మున్నీలాల్ కు ఆయన ఖాతాలోని 15 వేల రూపాయాలను డ్రా చేసి ఇచ్చాడు ఈ నగదు తీసుకొన్న తర్వాతే మున్నీలాల్ తన భార్య అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో గౌతమ్ బుద్ద కలెక్టర్ విచారణకు ఎన్ పి సిం గ్ ఆదేశించారు.

English summary
currency ban effect on cremeation in uttar pradesh, munnilal vegetable venor, he is wife, son, on monday his wife died with cancer. he has no money for cremeation. along with sons accounts he has 16000 rupees in bank accounts. on monday he went to bank for draw money, but currency not available in bank, on tuesday munnilal went bank for draw money, media m local leaders asked for munnilal, then bank manager give to money from his accounts.after tha munilal conduct ceremeation his wife. distict collector order to enquiry this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X