ప్రశంస: ఒబామా, మిచెల్లీ మనసుదోచిన ఢిల్లీ 'ఐటీసీ మౌర్య' హోటల్
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భారత్ పర్యటన సందర్భంగా ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో విడిది చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆ హోటల్ సిబ్బంది పైన ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన ఆతిథ్యం అంటూ కితాబిచ్చారు.
బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ ఒబామాలు ఐటీసీ మౌర్యలో జనవరి 25వ తేదీ నుండి జనవరి 27 వరకు ఉన్నారు. వీరికి రెండు పడక గదులు, పెద్ద భోజనాలయం, స్టడీ, ఇతర వసతులున్న ప్రత్యేకమైన గ్రౌండ్ ప్రెసిడెన్షియల్ విభాగాన్ని కేటాయించారు. ఒబామా ప్రతి రోజూ ఈ హోటల్లోని జిమ్‌నే వినియోగించుకున్నారు.

హోటల్లోని వెస్ట్ వ్యూ రెస్టారెంట్ నుండే జనవరి 26న భారత సీఈవోలతో జరిగిన విందు సమావేశానికి భోజనం వెళ్లింది. ఒబామా ఎలాంటి అరమరికలు లేకుండా అందరితో కలివిడిగా గడిపారని పలువురు ప్రశంసించారు. అదే సమయంలో మిచెల్ ఎంపిక చేసిన కొందరు వ్యక్తులతో ఇదే హోటల్లోని బుఖారా రెస్టారెంటులో విందు చేశారు.
కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ తదితరులు అమెరికాకు చెందిన సంబంధిత శాఖల మంత్రులతో ఇదే హోటల్లోని దమ్ పఖ్త్ రెస్టారెంటులో విందులో పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు ఒబామాను ఐటీసీ మౌర్యలో కలిశారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications