Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైరల్ వీడియో: కానివ్వండ్రా.. కానివ్వండి..!

చదువుల నిలయంగా చెప్పుకునే విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు చెప్పకూడని పనులు చేస్తున్నారు. ఓ వైపు లెక్చరర్ పాఠాలు బోధిస్తుంటే శ్రద్ధగా వినాల్సింది పోయి.. పాడు పని చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తరగతి గదిలో రొమాన్స్ ఏంటి అంటూ నెటిజెన్లు మండిపడుతున్నారు. వాళ్లను వెంటనే కాలేజీ నుంచి డిబార్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చుట్టూ తోటి విద్యార్థులు ఉన్నా ఏ మాత్రం వణుకు బెణుకు లేకుండా ఇలాంటి పనులు చేయడంపై నెటిజెన్లు మండిపడుతున్నారు.

యువత రొమాన్స్ లు మెట్రో స్టేషన్లు, బస్ స్టాండ్లు, పార్కులు దాటి ఇప్పుడు క్లాస్ రూమ్ ల్లోకి కూడా వచ్చింది. తోటి విద్యార్థులు ఉన్నా వారిని పట్టించుకోకుండా వీళ్లు రొమాన్స్ నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజెన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ వైపు లెక్చరర్ పాఠాలు చెబుతుంటే మీరు చేసే పనేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ వడోదరాలోని మహారాజా సయాజిరావ్ బరోడా యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది.

అయితే ఈ వీడియోను ఆ జంటకు తెలియకుండా వెనుకనుంచి కొందరు విద్యార్థులు చిత్రీకరించారు. ఆ తర్వాత వీడియోను వైరల్ చేశారు. ఈ ఘటన యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కమిటీ నివేదిక అనంతరం విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించనున్నారు.

Baroda s Bold Bliss Viral Video Captures Couple s Steamy Romance on University Campus

మరోవైపు ఈ ఘటనతో మహారాజా సయాజిరావ్ బరోడా యూనివర్సిటీపై భద్రతా అనుమానాలను పెంచడంతోపాటు యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వీడియో వైరల్ అయింది. ఇటీవలి కాలంలో అనేకమంది యువత ఇలా బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరికొందరు రీల్స్ కోసం ఇలా చేస్తున్నారు. కొంతమంది యువత దర్శనీయ ప్రాంతాల్లోనూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటనలు బయటకు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+