సీఎం పదవికి రాజీనామా చేసిన సీఎం, అన్నింటికి తానే బాధ్యుడు, అంతే కాని?
బెంగళూరు/హావేరి: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది. బీజేపీని ఇంటికి పంపించిన కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇంతకాలం అధికారంలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ హుబ్బళి నుంచి నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు చేరుకుని ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.
శనివారం రాత్రి బెంగళూరు చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు, గవర్నర్ కు రాజీనామా చేసిన తరువాత బసవరాజ్ బోమ్మయ్ రాజ్ భవన్ భయట మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

కర్ణాటకలో తాము అధికారం కోల్పోవడానికి ఏమిటి కారణం, అసలు ఏమి జరిగింది అని తాము ఆత్మపరిశీలన చేసుకుని తరువాత మీడియాతో మాట్లాడుతామని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి జాతీయ నాయకులు, కర్ణాటకలోని నాయకులు కారణం కాదని, అందుకు పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నానని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
ప్రతిపక్షంలో కుర్చుని తాము కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తామని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. అయితే కర్ణాటకలో బీజేపీకి ఓడిపోవడానికి బసవరాజ్ బోమ్మయ్ మాత్రం పక్కా క్లారిటీ ఇవ్వలేదు. బసవరాజ్ బోమ్మయ్ మంత్రివర్గంలో ఉన్న చాలా మంది నాయకులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ సొంత జిల్లాలో ఆ సీఎం తప్పా మిగిలిన ఐదు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది,












Click it and Unblock the Notifications