బీబీసీ ఇంటర్వ్యూలో బీజేపీ డిప్యూటీ సీఎం రచ్చ- రిపోర్టర్ మాస్క్ లాగి- నడ్డా, యోగీకి ఫిర్యాదు చేసినా
బీజేపీకి చెందిన యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుచితంగా ప్రవర్తించడంపై బీబీసీ తాజాగా వివరణ విడుదల చేసింది. దీని ప్రకారం ఆ ఇంటర్వ్యూలో మౌర్య వ్యవహారశైలి ఎలా ఉందో బీబీసీ వివరించింది. తమ రిపోర్టర్ తో మౌర్య వ్యవహారశైలిని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపింది.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, గత నెల హరిద్వార్ ధర్మ సంసద్‌లో చేసిన విద్వేషపూరిత ప్రసంగాలపై బిజెపి ప్రభుత్వం మౌనంగా ఉండటంపై బీబీసీ ఇంటర్వూలో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆయన ఈ ప్రశ్నలకు కోపంతో సోమవారం బీబీసీ ఇంటర్వ్యూ నుండి వాకౌట్ చేశారు. అంతే కాదు మౌర్య తన భద్రతా సిబ్బందిని ఇంటర్వ్యూ వీడియోను తొలగించమని కోరాడంతో పాటు రిపోర్టర్ అనంత్ జనానే కోవిడ్ మాస్క్‌ని కూడా లాగేసినట్లు బీబీసీ తెలిపింది. దీంతో ఆయన అనుచిత ప్రవర్తన చర్చనీయాంశమవుతోంది.
అంతకుముందు ఈ ఇంటర్వ్యూలో మౌర్య... ధర్మాచార్యులు తమ వేదిక నుంచి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కుందంటూ సమర్ధించారు. హరిద్వార్‌లో ధర్మసంసద్ వేదిక నుంచి ముస్లింలపై హింసను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగీ ఎందుకు మౌనంగా ఉన్నారని, అధికారుల మౌనం ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తుందన్న విలేఖరి ప్రశ్నకు మౌర్య తడబడ్డారు. దీనిపై స్పందిస్తూ బిజెపికి సర్టిఫికేట్ అవసరం లేదు. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్‌ను అభివృద్ధి చేయడాన్ని మేము నమ్ముతున్నామన్నారు.

ఇతర మత పెద్దలు చేసిన ప్రకటనలపై మాట్లాడాలని డిప్యూటీ సీఎం మౌర్య బీబీసీ విలేకరిని కోరారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ, కాశ్మీర్ నుంచి ఎంత మంది ప్రజలు వలస వెళ్ళాల్సి వచ్చిందనే దానిపై ఎందుకు మాట్లాడరంటూ ఆయన్ను ఎదురు ప్రశ్నించారు. మీరు ప్రశ్నించినప్పుడు ఒకవైపే ఆ ప్రశ్నలు ఉండకూడదన్నారు. ధర్మ సంసద్ బీజేపీది కాదని, సన్యాసులదన్నారు. అలాగే ఈ సదస్సులో విద్వేష వ్యాఖ్యలు చేసిన నిందితులు యతి నరసింహానంద్ ఘజియాబాద్‌కు చెందిన వారని, అన్నపూర్ణ అలీఘర్‌కు చెందినవారని, ఈ వ్యక్తులు సృష్టిస్తున్న వాతావరణానికి వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించగా, మౌర్య మాట్లాడుతూ, ఎవరూ వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించరని, ఏది సరైనది, ఏది తప్పు, ఏది సముచితమో వారు చెప్పారన్నారు.
ఆ తర్వాత రిపోర్టర్‌ని జర్నలిస్టులా కాకుండా ఏజెంట్‌లా మాట్లాడుతున్నారని మౌర్య ఆరోపించారు. బీబీసీ హిందీ పోస్ట్ చేసిన వీడియోలో, అతను తన చొక్కాకు పెట్టిన మైక్‌ని తీసేశారు. కెమెరా స్విచ్ ఆఫ్ అయిన తర్వాత, మౌర్య బీబీసీ రిపోర్టర్ కోవిడ్ మాస్క్‌ని లాగి, వీడియోను డిలీట్ చేయని ఆయన సెక్యూరిటీని ఆదేశించారు. ఇలా రెండు కెమెరాల్లో వీడియో డిలీట్ చేశారు. అయితే ఆ తర్వాత కెమెరామెన్ డిలీట్ అయిన వీడియోనూ రికవర్ చేశాడని బీబీసీ వివరించింది. ఆ తర్వాత బీబీసీ ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, యూపీ సీఎం యోగీకి కూడా ఫిర్యాదు చేసింది. అయినా వారు స్పందించలేదని బీబీసీ తెలిపింది.
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications