బీబీఎంపీ ఎన్నికలు: 12 గంటలకు 10 శాతం ఓటింగ్

బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో ఓట్లు వెయ్యడానికి నగర ప్రజలు పెద్దగా ఆస్తకి చూపించలేదు. ఈ దెబ్బకు పోటిలో ఉన్న అభ్యర్థులు ఢీలా పడిపోయారు. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓట్లు వెయ్యడానికి అవకాశం ఉంది.

శనివారం ఉదయం 7 గంటలకు నగరంలోని 197 వార్డులలో పోలింగ్ కేంద్రాలలో అధికారులు సిద్దంగా ఉన్నారు. అయితే పలు చోట్లు వర్షం పడటంతో ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాలేదు. 198 వార్డులలోని హోంగసంద్ర వార్డులో బీజేపీ అభ్యర్థి గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

మిగిలిన 197 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నగరంలో మొత్తం 73.88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ నుండి 197, కాంగ్రెస్ నుండి 197, జేడీఎస్ నుండి 187, బీఎస్ పీ నుండి 34, ఏఐడీఎంకే నుండి 7, స్వతంత్ర అభ్యర్థులుగా 339 మంది బరిలో ఉన్నారు.

BBMP Elections 2015 on 22nd August Saturday, 2015.

అయితే శనివారం మధ్యాహ్నాం 12 గంటలకు కేవలం 10.12 శాతం ఓటింగ్ జరిగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు చూడటానికి వెనకడుగు వేశారు. పలువురు పోటిలో ఉన్న అభ్యర్థులు ఓటర్ల ఇండ్ల దగ్గరకు వెళ్లి ఓట్లు వెయ్యాలని ప్రాధేయపడ్డారు.

20 వేల మంది పోలీసులతో గట్టి బందో బస్తు ఎర్పాటు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్.ఎస్. మేఘారికర్ తెలిపారు. జీవన్ భీమానగరలో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మేఘారికర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+