రూ.లక్షను రూ.18 లక్షలు చేసిన స్టాక్
మంచి స్టాక్ ను ఎంచుకుంటే లాభాలుంటాయి. కొన్ని స్టాక్స్ పెట్టుబడిదారులకు లాభాల పంటను పండిస్తుంటాయి. అతి తక్కువ సమయంలోనే ఇవి ఎన్నో రెట్లు పెరుగుతుంటాయి. ఊహించని విధంగా లాభాలను అందిస్తాయి కాబట్టే వీటిని మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. ప్రస్తుతం మనం అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకుందాం. 3 సంవత్సరాల కాలంలోనే లక్ష రూపాయలను రూ.18 లక్షలు చేసి పెట్టుబడిదారులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది..
అంతేకాదు.. మూడేళ్ల వ్యవధిలో 1700 శాతానికి పైగా పెరిగింది. అదే బీసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇటీవలే బోనస్ సహా స్టాక్ స్ప్లిట్‌ను కూడా ప్రకటించింది. నెలరోజుల వ్యవధిలోనే 18 శాతానికి పైగా పెరిగింది. వంటనూనెలను తయారుచేస్తుంటుంది. బుధవారంనాడు రూ.524కు చేరింది. చివరకు రూ.512 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1250 కోట్లు. జూన్ 20వ తేదీన 52 వారాల గరిష్టమైన రూ.536.35 నమోదు చేసింది.

1:10 రేషియోలో స్టాక్ స్ల్పిట్ ప్రకటించింది. రూ.10 విలువ ఉన్న ప్రతి షేరు కూడా రూ.1 ముఖ విలువ ఉంటే.. 10 ఈక్విటీ షేర్లుగా మారతాయి. స్టాక్ ట్రేడ్ వాల్యూమ్, లిక్విడిటీ పెంచేందుకు దోహదపడుతుంది. ఒక్కో షేరుపై రూ.5 డివిడెండ్ కూడా ప్రకటించింది. నికర లాభం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 6 శాతం పెరిగి రూ.24.31 కోట్లుగా నమోదైంది.
మూడు సంవత్సరాల క్రితం రూ.29 వద్ద ఈ కంపెనీ షేరు ఉండేది. తాజాగా రూ.520 దాటింది. మూడేళ్ల క్రితం బీసీఎల్ లో రూ.లక్ష పెట్టుబడి పెట్టినవారికి ప్రస్తుతం రూ.18 లక్షలు వచ్చాయి. భవిష్యత్తులో కూడా పెరిగే సూచనలే కనపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇండియా, దక్షిణాసియా ప్రాంతంలో .. ఫార్వర్డ్.. బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేటెడ్ డిస్టిలరీ ఇథనాల్ ప్లాంట్ ఉన్న ఏకైక కంపెనీ బీసీఎల్ ఇండస్ట్రీస్ కావడం విశేషం.












Click it and Unblock the Notifications