వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీ అలర్ట్: ఆ మెసేజ్‌కు జియోకు సంబంధం లేదు..

అనంతరం అదే మెసేజ్ ను మరో 10మందికి పంపించాలని అందులో రాసి ఉంటుంది. ఇలా ఒకరినుంచి మరొకరికి ఈ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జియో పేరిట చక్కర్లు కొడుతోన్న ఓ వైరల్ మెసేజ్ యూజర్స్ వ్యక్తిగత డేటాను హ్యాక్ చేస్తోంది. ఫేస్ బుక్ ద్వారా ఈ మెసేజ్ ఎక్కువగా వైరల్ అవుతోన్నట్టు తెలుస్తోంది. మెసేజ్ లో వస్తున్న లింకును క్లిక్ చేస్తే.. జియో యూజర్స్ డేటా పరిమితి 1జీబీ నుంచి 10జీబీకి అప్ గ్రేడ్ అవుతుందన్న సందేశం అందులో రాసి ఉంటుంది.

ఈ లింకును క్లిక్ చేయగానే.. యూజర్స్ సమాచారమంతా సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ మెసేజ్ ను మరో 10మంది స్నేహితులకు ఫార్వార్డ్ చేయమంటూ అందులో పేర్కొనడంతో.. ఎక్కువ మంది యూజర్స్ దీని బారిన పడుతున్నారు. లింక్ ను క్లిక్ చేసిన తర్వాత యూజర్స్ వివరాలను పొందుపర్చాల్సిందిగా స్క్రీన్ పై కనిపిస్తుంది.

Be alert, jio is not increasing its daily download limit

అనంతరం అదే మెసేజ్ ను మరో 10మందికి పంపించాలని అందులో రాసి ఉంటుంది. ఇలా ఒకరినుంచి మరొకరికి ఈ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. సర్వీస్ అప్ గ్రేడ్ అవుతుందని నమ్మి ఈ లింకులో వివరాలు పొందుపరిచారో.. ఆ డేటా అంతా సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది.

ఇందులోనే గో4జీ అనే మరో ఆప్షన్ కూడా వస్తోంది. దీనికి రిలయెన్స్ లేదా జియోకు సంబంధం లేదని, నిబంధనలు లేదా షరతుల్లో తెలుపుతారు. డేటా పరిమితిని పెంచుతున్నట్టు జియో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి.. ఇలాంటి మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

English summary
A Fake message is going viral in facebook that saying jio is increasing its data. If you click the link which mentioned in that, your details will gone into the hands of cyber criminals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X