తస్మత్ జాగ్రత్త: న్యూ ఇయర్ వేళ ఒమిక్రాన్ గురించి మోడీ సందేశం
ఒమిక్రాన్ బెంబేలెత్తిస్తోన్న వేళ.. జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రజలు.. పాత ఏడాదికి వీడ్కోలు పలికి.. న్యూ ఇయర్‌కు వెల్ కం చెప్పేందుకు ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు. అయితే గుంపులు గుంపులుగా ఉండటంతో.. ప్రమాదం అని.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తతే శ్రీరామ రక్ష అని వివరించారు. ప్రజలు అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ దరించాలని.. చేతులను శుభ్రంగా కడుక్కొవాలని కోరారు.
ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆస్పత్రు్లో బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందని వివరించారు. కరోనా లేదని మరవొద్దు అని.. అదీ మనతో పాటు ఉంటుందని.. జాగ్రత్తగా ఉండాలని కోరారు.
దేశంలో ఇప్పటికే 18 లక్షల ఐసోలేషన్ బెడ్లు, 5 లక్షల ఆక్సిజన్ బెడ్లు, 1.40 లక్షల ఐసీయూ బెడ్లు, 90 వేల పీడియాట్రిక్ ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ సిద్దంగా ఉన్నాయని చెప్పారు. 3 వేల కంటే ఎక్కువ పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్, 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేశామని తెలిపారు.

ఇటు ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకునే సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
ఒమిక్రాన్ బెంబేలెత్తిస్తోన్న వేళ.. జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రజలు.. పాత ఏడాదికి వీడ్కోలు పలికి.. న్యూ ఇయర్‌కు వెల్ కం చెప్పేందుకు ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు. అయితే గుంపులు గుంపులుగా ఉండటంతో.. ప్రమాదం అని.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తతే శ్రీరామ రక్ష అని వివరించారు. ప్రజలు అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ దరించాలని.. చేతులను శుభ్రంగా కడుక్కొవాలని కోరారు.

Click it and Unblock the Notifications