బియాస్ ట్రాజెడీ: మరో మృతదేహం లభ్యం, 21 వెలికితీత

మండి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల్లో మంగళవారం ఉదయం మరో మృతదేహం లభ్యమైంది. దాన్ని బస్వరాజు సందీప్‌యాదవ్ మృతదేహంగా గుర్తించారు. బియాస్ నదిలో జూన్ 8వ తేదీన 24 మంది విద్యార్థులు గల్లంతు కాగా ఇప్పటి వరకు 21 మృతదేహాలను వెలికితీశారు.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం ఓ విద్యార్థి మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. ఈ మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌గా గుర్తించారు.

Beas tragedy: Another dead body found

జూన్ 8వ తేదీన విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కుటంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.ఈ మొత్తాన్ని జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరిసగం చొప్పున చెల్లించాలని న్యాయస్థానం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+