మైనర్లపై అత్యాచారం చేస్తే ఉరే: కేంద్రం ప్రతిపాదన
న్యూఢిల్లీ: 12 ఏళ్ళ వయస్సున్న బాలికలపై లైంగిక దాడికి పాల్పడేవారికి ఉరిశిక్ష విధించేలా పోస్కో చట్టాన్ని సవరించే ప్రక్రియను ప్రారంభించామని కేంద్రం సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది.
కథూవాలో 8 ఏళ్ళ మైనర్‌బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదికను సమర్పించింది. ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నివేదికను ఇచ్చింది.ఈ విషయమై ఏప్రిల్ 27న, తదుపరి విచారణను చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది.

కథువాలో ఎనిమిదేళ్ల బాలికను నిర్భందించి దుండగులు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు మైనర్ బాలికలపై లైంగిక దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. యూపీలో ఇటీవల ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడి హతమార్చారు.
దేశంలో వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనలతో పోస్కో చట్టంలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదికను ఇచ్చింది. దోషులను కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉంటేనే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కావనే అభిప్రాయాలు లేకపోలేదు. దీంతో పోస్కో చట్టంలో సవరణలకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్గు దృష్టికి తీసుకెళ్ళింది.












Click it and Unblock the Notifications