బేరూత్ పేలుళ్ల కేసు: లెబనాన్‌లో నిరసనకారులపై కాల్పులు.. ఆరుగురు మృతి - Newsreel

లెబనాన్ రాజధాని బేరూత్‌లో నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు.
గత ఏడాది బేరూత్ నౌకాశ్రయాన్ని కుదిపేసిన భారీ పేలుళ్లపై విచారణకు వ్యతిరేకంగా షియా ముస్లిం సంస్థలు హెజ్బొల్లా, అమల్ నిరసనలు చేపడుతున్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి.
లెబనీస్ ఫోర్సెస్ (ఎల్ఎఫ్)కు చెందిన క్రిస్టియన్ స్నైపర్స్ ఈ కాల్పులు జరిపారని వార్తలు వచ్చాయి. అయితే, తాము ఎలాంటి కాల్పులూ జరపలేదని ఎల్ఎఫ్ వివరించింది.
గత ఏడాది చోటుచేసుకున్న బేరూత్ నౌకాశ్రయ పేలుళ్లలో 219 మంది మరణించారు. అయితే, దీనిపై విచారణ చేపడుతున్న జడ్జి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని హెజ్బొల్లా ఆరోపిస్తోంది.
అయితే, బాంబు పేలుళ్ల బాధితుల కుటుంబాలు మాత్రం ఆయనకు మద్దతు ప్రకటించాయి.
ఆగస్టు 2020లో జరిగిన ఆ పేలుళ్లను తామే చేపట్టామని ఇప్పటివరకు ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించుకోలేదు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా, కరెంటు కోతలు ఇంకా పెరుగుతాయా?
- మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- జీ-20 సదస్సులో నరేంద్ర మోదీ: 'అఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదానికి కేంద్రంగా మారనివ్వద్దు'
- వాతావరణ మార్పులు: కాప్-26లో భారత్, చైనా చేతులు కలిపి అమెరికానే ప్రతిఘటిస్తాయా?
- మోదీ తీసుకొస్తున్న 'బలవర్ధక బియ్యం’ ఏంటి? ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












Click it and Unblock the Notifications