వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భంధాల నడుమ కశ్మీర్‌లోని హర్ముఖీ వ్యాలీని అధిరోహించిన జంట..!

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ అందాలను రెండు కళ్లతో చూడ్డం సాధ్యం కాదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులకు తెలుసు, కాని ఆ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్య కశ్మీర్ అందాలను ఆస్వాధించే అవకాశం భారతీయులకే సరిగా లేని దుస్థితి నెలకోందిద. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు, రోజు ఎక్కడో ఓ చోట ఉగ్రదాడులు,ఎన్ కౌంటర్ల మోతలు కశ్మీర్‌ను రక్త సిక్తం చేశాయి.ఇక తాజాగా 370 ఆర్టికల్ రద్దుతో అక్కడ మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే..అయితే ఇవేవి పట్టించుకోని ఓ విదేశీ జంట కైలాశ్ ఆఫ్ కశ్మీర్‌గా పలిచే హర్ముఖీ వ్యాలీని అధిరోహించింది.

 370 ఆర్టికల్ రద్దుతో కశ్మీర్‌లో ఉద్రిక్తతలు

370 ఆర్టికల్ రద్దుతో కశ్మీర్‌లో ఉద్రిక్తతలు

కశ్మీర్‌కు ప్రత్యేక పత్రిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్న విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలోనే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అమర్‌నాథ్ యాత్రను సైతం 16 రోజుల ముందుగానే ముగించారు. దీంతో కశ్మీర్‌లో ఉన్న యాత్రికులను ఉన్నపళంగా కశ్మీర్ నుండి వెళ్లిపోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగస్టు ఆయిదు నుండి కూడ ఇతర దేశాల టూరిస్టులు ఎవ్వరు కశ్మీర్ విజిటింగ్‌కు రాని పరిస్థితి నెలకోంది.

హర్ముఖి వ్యాలీని అధిరోహించిన బెల్జియం జంట

హర్ముఖి వ్యాలీని అధిరోహించిన బెల్జియం జంట

కశ్మీర్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే విదేశాలు తమ పౌరులను కశ్మీర్‌ వెళ్లవద్దని సూచించింది..దీంతో కశ్మీర్‌కు గత నెలరోజులుగా టూరిస్టులు ఎవ్వరు కూడ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇవేమీ ఖాతరు చేయకుండా ఓ బెల్జియం చెందిన జంట మాత్రం నిర్భంధం మధ్య కశ్మీర్‌ కొండల్లో సహాస యాత్ర చేసింది. చాల రోజుల నుండి కశ్మీర్ టూర్ వేయాలని ప్లాన్ వేసుకున్న సామ్, నలియా అనే జంట వ్యాలీలోని హర్మూఖ్ పర్వత శ్రేణిని అధిరోహించాలని భావించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు పక్కన పెట్టి హర్ముక్ లేక్ వ్యాలీని సామ్, నలియా విజయవంతగా అధిరోహించారు. కాగా 15000 అడుగుల ఎత్తు ఉండే హర్మూఖ్ వ్యాలీ కైలాశ్ ఆఫ్ కశ్మీర్‌గా పేరుగాంచింది.

సంచారజాతీయుల సహయంతో శిఖరాన్ని అధిరోహించిన జంట

సంచారజాతీయుల సహయంతో శిఖరాన్ని అధిరోహించిన జంట


ఈ సంధర్భంగా వారు తమ అభిప్రాయాన్నిమీడియాతో పంచుకున్నారు. ఎన్నో నిర్భంధాలు ఉన్న తాము ఇక్కడకు చేరుకున్నామని చెప్పారు.హర్ముఖ్ హిల్స్‌లోని ఆల్ఫైన్ అడవులు, ఆందమైన ఆకుపచ్చ బయళ్లు ,అందమైన సరస్సులనను చూశామని వారు పేర్కోన్నారు.ఇక హర్ముఖ్ శిఖరం నుండి వెలువడే సూర్యోదయం తోపాటు సూర్యాస్తమయాన్ని చూడడం వారికి మరిచి పోలేని రోజని తెలిపారు. అయితే ఇన్ని నిర్భంధాల మధ్య స్థానికంగా ఓ సంచారజాతియుల సహాయంతో అక్కడకు చేరుకున్నట్టు వారు తెలిపారు. సంచారజాతీయులే వారికి అశ్రయిమిచ్చినట్టు చెప్పారు.ఇక తమ ప్రయాణంలో ఎలాంటీ ఉగ్రవాద చాయలు కూడ కనిపించలేదని వారు తెలిపారు.

English summary
Ignoring advisories from diplomatic missions, a Belgium couple has kept its date with the Valley, going on a trek they had been planning months before the Centre abrogated the special status of Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X