Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతు నోట్లో బూటుకాలు పెట్టిన ఎస్ఐ ఏం చేశాడంటే, ధైర్యంగా వెళ్లిన అన్నదాత భార్యకు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలోని (Karnataka) రాయచూరు జిల్లా మస్కీ పట్టణంలో ట్రాక్టర్ నడుపుతూ రైతుపై సబ్ ఇన్స్ పెక్టర్ (SI) మణికంఠ దాడికి పాల్పడ్డాడు. రైతు నోట్లో బూటు కాలు పెట్టి దాడి చేసి క్షమించరాని నేరం చేశాడని, తప్పు చేసిన ఎస్‌ఐని (SI) పర్మినెంట్ గా సర్వీస్‌ నుంచి తొలగించాలని రత్న భారత జాతీయ ఉపాధ్యక్షుడు, మహదాయి (farmer) ఉద్యమకారుడు హేమన్‌గౌడ బసన గౌడ డిమాండ్‌ చేశారు.

హుబ్బళి నగరంలో రైతు (farmer) సంఘం నాయకుడు హేమనగౌడ విలేకరులతో మాట్లాడుతూ అమాయకుడైప రైతుపై దాడి చేయడం సరికాదని, ఎస్ఐ మణికంఠ ఆనవసరంగా దాడి చేశాడని, ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐ (SI) సస్పెన్షన్‌కు గురయ్యారరని అన్నారు. బళ్లారి జోన్ ఐజీ లోకేష్ కుమార్ ఎస్ఐ మణికంఠను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇది శిక్ష కాకూడదు. మానవత్వం లేకుండా రైతుల (farmer) పట్ల ఉదాసీనత ప్రదర్శించిన పోలీసు అధికారి మణికంఠను శాస్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని హేమనగౌడ డిమాండ్ చేశారు.

Bellary Zone IGP suspends sub-inspector who tortured farmer by kicking him with boot leg.

మస్కీ పట్టణంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడంటూ నిరుపడి అనే ట్రాక్టర్ డ్రైవర్‌, రైతు (farmer) అయిన అతన్ని ఎస్‌ఐ (SI) మణికంఠ కొట్టారు. అలాగే నోటిల బూటు కాలు పెట్టి చిత్రహింసలు పెట్టారని నీరుపడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్కీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే (SI) మణికంఠను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వాల్మీకి సంఘం, వివిధ రైతు అనుకూల సంఘాలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాయి.

ఈ కేసులో ఇప్పుడు ఎస్‌ఐ మణికంఠ సస్పెన్షన్‌కు గురయ్యారు. కానీ ఈలాంటి కిరాతకుడైన ఎస్ఐ (SI) మణికంఠకు అలాంటి శిక్ష విధించిన తర్వాత ఆ పోలీసు మళ్లీ అధికారం ఉపయోగించి పై అధికారులకు లంచం ఇచ్చి మళ్లీ సర్వీసులో చేరతాడు, ఆ తర్వాత వారి దౌర్జన్యాలు కొనసాగుతాయని రైతు (farmer) సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అందువల్ల అతనికి ఈ శిక్ష సరిపోదని, అతన్ని శాస్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని రైతు సంఘం నాయకుడు హేమన్ గౌడ డిమాండ్ చేశారు.

Bellary Zone IGP suspends sub-inspector who tortured farmer by kicking him with boot leg.

హోమ్ మంత్రి జీ.పరమేశ్వర్‌కు ఫోన్‌లో పలుమార్లు సంప్రదించి కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ప్రయత్నించగా మంత్రి ఫోన్‌ కాల్‌ను అంగీకరించలేదని రైతు సంఘం నాయకుడు తెలిపారు. సెప్టెంబర్ 20న మస్కి పట్టణంలో ట్రాక్టర్‌లో రైతు (farmer) నీరుపడి ఇసుకను తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో ఎస్‌ఐ (SI) మణికంఠ ట్రాక్టర్‌ను ఆపి ఇసుకను తీసుకెళ్లేందుకు రూ. 20 వేలు డిమాండ్‌ చేశాడు.

తన జీపులోంచి పైపు తీసుకుని నిర్దాక్షిణ్యంగా కొట్టాడని కూడా రైతు (farmer) నీరుపడి మీడియాకు చెప్పారు. అలాగే ఎస్‌ఐ (SI) మణికాంఠ తనను కులం పేరుతో దూషణలకు పాల్పడ్డాడని, తన నోటిలో బూటుకాలు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడని నీరుపడి ఆరోపించారు. దీంతో దాడి, బెదిరింపు, కుల (farmer) పేరుతో దూషించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

ఈ విషయమై ఎస్‌ఐ మణికంఠపై చర్యలు తీసుకోవాలని వాల్మీకి నాయక మహాసభ తాలూకా యూనిట్‌, రైతు (farmer) సంఘాలు లింగాసూర్‌ డివైఎస్‌పి మంజునాథ్‌, సీఐ బాలచంద్రకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐ (SI) మణికంఠను కఠినంగా శిక్షించాలని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే ఇప్పటికే ఎస్ఐ మణికంఠను సస్పెండ్ చేసిన ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+