West Bengal Opinion: బెంగాల్లో ఓటర్ల తీర్పు క్లియర్-సీట్లతో సహా తేల్చేసిన సట్టా బజార్..!

పశ్చిమ బెంగాల్ (West Bengal)( అసెంబ్లీకి రెండు విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. దీంతో పలు సర్వే సంస్థలు జనం నాడిని పసిగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మెజార్టీ సర్వే సంస్థలు అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)కే మరోసారి అవకాశం దగ్గబోతోందని తేల్చాయి. ఈ నేపథ్యంలో సట్టా బజార్ కూడా తన అంచనాలను వెల్లడించింది.

సట్టా బజార్ అంచనాల ప్రకారం బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య అనుకున్న దానికి మించి గట్టి పోటీ నెలకొంది. ఇందులో
టీఎంసీకి 158-161 సీట్లు, బీజేపీకి 127-130 సీట్లు, ఐఎన్‌సీకి 4-6 సీట్లు వస్తాయని అంచనా వేసింది.. ఇది మార్కెట్లో అత్యంత బలమైన అంచనాగా భావిస్తుంటారు. ఈ లెక్కన టీఎంసీ సాధారణ మెజారిటీని దాటుతుంది, కానీ అతి కష్టం మీద. అదే సమయంలో, రాష్ట్రంలో బీజేపీ తన చరిత్రలోనే అత్యంత బలమైన ప్రదర్శనను కనబరుస్తుందని అంచనా. బీజేపీ గరిష్ట అంచనాకు, టీఎంసీ కనిష్ట అంచనాకు మధ్య అంతరం కేవలం 28 సీట్లే ఉండటం, తుది ఫలితంపై నెలకొన్న తీవ్రమైన అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది.

Bengal 2026 Satta Forecast TMC at 158 161 BJP Surges to 127 130 in Closest-Ever Predicted Contest

పశ్చిమబెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతకు తోడు భారీ ఎత్తున ఈసీ తొలగించిన ఓట్ల ప్రభావం కూడా ఎన్నికలపై పడుతోంది. దీంతో బీజేపీ భారీ ప్రయోజనం పొందుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ బంగ్లాదేశ్ వలసలపై చేస్తున్న ప్రచారం ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపిస్తోంది. అయినా మమత సర్కార్ పకడ్బందీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావంతో నాలుగోసారి కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు అర్ధమవుతోంది. బెంగాల్లో ఎల్లుండి తొలి దశ ఎన్నికలు జరగనుండగా.. ఈ నెల 29న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+