వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త హత్య.. రాజకీయ హత్య అంటోన్న అమిత్ షా..సీబీఐ విచారణకు డిమాండ్

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. బీజేపీ శ్రేణులకు వేధింపులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొందరీపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల కోల్ కతాలో ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యారు. చిట్‌పూర్ కొసిపోర ఏరియాలో ఘటన జరిగింది. దీనిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. హత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అర్జున్ చౌరసియా అనే బీజేపీ కార్యకర్త పాడుబడ్డ భవనంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసి వేలాడదీయబడ్డాడు. అమిత్ షాకు స్వాగతం పలికే శ్రేణుల్లో ఒకరు.. ఇతని నేతృత్వంలో బైక్ ర్యాలీ తీయాల్సి ఉంది. కానీ ఇంతలోనే దారుణ హత్యకు గురయ్యారు. దీనిని అమిత్ షా ఖండించారు. బెంగాల్‌లో ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

Bengal BJP worker’s death: Amit Shah condemns ‘political murder’

బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం ఏర్పడి నిన్నటితో ఏడాది పూర్తయ్యింది. ఆ వెంటనే ప్రత్యర్థులపై హత్యలు చేస్తోంది. అర్జున్ హత్యను బీజేపీ ఖండించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడి నానమ్మను కూడా కొట్టారని అమిత్ షా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం స‌ృష్టిస్తున్నారని అమిత్ షా అన్నారు.

హింస రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం కాదని అమిత్ షా అన్నారు. బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. బెంగాల్ హైకోర్టు అనుమతితో కేసులను సీబీఐకి అప్పగించాలని అభిప్రాయపడ్డారు. సీబీఐ విచారణతో నిజాలు నిగ్గు తేలుతాయని ఆయన అంటున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతి వస్తే.. సీబీఐ విచారణ జరిపిస్తామని షా అంటున్నారు.

English summary
BJP worker Arjun Chourasiya was found hanging from the ceiling of an abandoned building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X