• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెంగాల్ ఆట బొమ్మ కాదు : మోడీ, షాపై దీదీ నిప్పులు

|

కోల్‌కత : బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో దీదీ అపారకాళీల కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌పై పగబట్టిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విద్యాసాగర్ కాలేజీలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత .. మోడీ, అమిత్ షాలపై నిప్పులు చెరిగారు.

ఆట బొమ్మ కాదు ..

ఆట బొమ్మ కాదు ..

లోక్‌సభ ఎన్నికలకు ముందు అమిత్ షా రోడ్‌తో మొదలైన గొడవ అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. తాజాగా టీఎంసీ, బీజేపీ కార్యకర్తల హత్యలతో బెంగాల్ రణరంగంగా మారింది. ఈ క్రమంలో గవర్నర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన చేయాలని సిఫారసు .. బీజేపీ నేతల మాటల యుద్ధానికి దీదీ ధీటుగా బదులిచ్చింది. 'పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రం. బెంగాలీలు ఆత్మగౌరవంతో నివసిస్తున్నారు. బెంగాల్ ఒక బొమ్మ కాదు. మీరు ఇష్టమొచ్చినట్టు ఆడుకోవడానికి .. మీరు మా రాష్ట్రంతో ఆడుకోలేరు .. అంతేకాదు మీకు బెంగాల్‌లో అధికారం కావాలన్న .. మీరు ఏం చేయని పరిస్థితి‘ అని మోడీపై మండిపడ్డారు.

అంతా మీరే చేశారు ..

అంతా మీరే చేశారు ..

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 18 సీట్లు సాధించడంతో .. టీఎంసీపై అధిపత్యం చలాయించే ప్రయత్నం చేస్తుంది. గతంలో మాదిరిగానే 30కి పైచిలుకు సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని మమత భావించారు. కానీ టీఎంసీ 22 సీట్లకే పరిమితం కావడం .. బీజేపీ నేతల దూకుడుతో ధీటుగానే స్పందిస్తున్నారు దీదీ. రాష్ట్రంలో కమ్యునిస్టులు 36 ఏళ్లు పాలించారు. తర్వాత టీఎంసీ అధికారం చేపట్టింది. కానీ మేం కార్ల్ మార్క్స్, లెనిన్ విగ్రహాలను కూల్చివేయలేదు అని స్పష్టంచేశారు. అమిత్ షా రోడ్ షో నేపథ్యంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ శ్రేణులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు మమత.

షానే బాధ్యుడు ..

షానే బాధ్యుడు ..

అమిత్ షా ఎన్నికల ర్యాలీ వల్లే విద్యాసాగర్ విగ్రహాం ధ్వంసమైంది. దీనికి అమిత్ షా నైతిక బాధ్యత వహించాలని దీదీ గుర్తుచేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈ దేశానికి హోంమంత్రి పదవీ చేపట్టారని విమర్శించారు. అంతేకాదు కాలేజీ పరిసరాల్లో అశుశోష్ ముఖర్జీ, రవీంద్రనాత్ ఠాగూర్, విద్యాసాగర్, కజీ నజ్రుల్ ఇస్తాం విగ్రహాలను కూడా నెలకొల్పుతామని హామీనిచ్చారు. మైనార్టీల ఓట్లు దండుకునేందుకు మమత వైఖరి ఇలా ఉందనే విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. తనకు ఆలయం ఎంతో మసీదు కూడా అంతేనని స్పష్టంచేశారు.

ఎంత ధైర్యం ..

ఎంత ధైర్యం ..

కొందరు టీఎంసీ కార్యకర్తలు విద్యాసాగర్ విగ్రహాం ధ్వంసం చేశారని ఆరోపించారు. వారికెంత ధైర్యం ఉంటే తమపై ఆరోపనలు చేస్తారని ప్రశ్నించారు. టీఎంసీ కార్యకర్తలు దాడిచేయరని, ఒకవేళ అలా చేస్తే తనే వారి చెంప చెళ్లుమనిపిస్తానని స్పష్టంచేశారు. అబద్దపు మాటలు చెప్పి హింసను ప్రేరేపిస్తుందని బీజేయేనని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన దాడుల్లో 10 మంది చనిపోతే .. వారిలో 8 మంది టీఎంసీ కార్యకర్తలేనని గుర్తుచేశారు. వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుందని హామీనిచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengal chief minister Mamata Banerjee on Tuesday launched an acerbic attack at the Bharatiya Janata Party at an event to unveil a new statue of Bengal reformer Ishwar Chandra Vidyasagar that was vandalized during the Lok Sabha elections. “Bengal is not a toy. You cannot play with it. You cannot do anything you want with Bengal,” the chief minister said at the event also attended by Trinamool Congress leaders, Bengal ministers and some spiritual leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more