బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు గూండాగిరి, నో బెయిల్, జ్యూడీషియల్ రిమాండ్!
Recommended Video

బెంగళూరు: పబ్ లో తప్పతాగి పారీశ్రామికవేత్త కుమారుడు విద్వత్ ను చితకబాదిన కేసులో అరెస్టు అయిన బెంగళూరులోని శాంతినగర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ ను జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుమారుడు మోహమ్మద్ తో సహ అతని అనుచరులను జైలుకు పంపించారు.

ఆసుపత్రిలో వైద్యపరీక్షలు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ తో సహ అతని అనుచరులకు బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యులు మోహమ్మద్ తో సహ అందరూ ఆరోగ్యంగా ఉన్నారని దృవీకరించారు.

పరప్పన అగ్రహార
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్, అతని అనుచరులను పోలీసులు జీపులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ వెలుతున్న పోలీసు జీపు వెనుక అతని అనుచరులు అనేక వాహనాలలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు వరకూ వెళ్లారు.

అర్దరాత్రి పబ్ లో !
ప్రముఖ వ్యాపారి లోక్ నాథ్ కుమారుడు విద్వత్ (24) శనివారం రాత్రి 11 గంటల సమయంలో యూబీ సిటీలోని పబ్ లో ఉన్న సందర్బంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఏ. హ్యారీస్ కుమారుడు మోహమ్మద్, అతని అనుచరులు చితకబాదేశారు. ఆ సమయంలో విద్వత్ ముఖం పగిలిపోయి తీవ్రగాయాలైనాయి.

ఆసుపత్రిలో హత్యాయత్నం
తీవ్రగాయాలైన విద్వత్ మాల్యా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నాడనే విషయం తెలుసుకున్న మోహమ్మద్ అతని అనుచరులు మాల్యా ఆసుపత్రికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించి మళ్లీ దాడి చేశారు. విద్వత్ కు మూడు వారాలపాటు చికిత్స చెయ్యాలని వైద్యులు అంటున్నారు.

ఎమ్మెల్యే ఒత్తిడి
ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మోహమ్మద్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హ్యారీస్ పోలీసుల మీద ఒత్తిడి తీసుకువచ్చి సాక్షాలు నాశనం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని విద్వత్ తండ్రి, వ్యాపారవేత్త లోక్ నాథ్ ఆరోపిస్తున్నారు.

నో బెయిల్
బెంగళూరులోని 8వ ఎసీఎంఎం న్యాయస్థానం ముందు మహమ్మద్ అతని అనుచరులను పోలీసులు హజరుపరిచారు. మోహమ్మద్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని అతని న్యాయవాది మనవి చేశారు. హత్యాయత్నం కేసు నమోదు కావడంతో బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి మహేష్ బాబు స్పష్టం చేశారు.

మార్చి 7వ వరకు
బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి మహేష్ బాబు మోహమ్మద్ తో సహ అందరీని మార్చి 7వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ పిటీషన్ విచారణ ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications