శశికళ దెబ్బకు సెంట్రల్ జైలు చీఫ్ ఔట్, ఎక్కడా పోస్టింగ్ లేదు, ఆ స్థానంలో ఓ మహిళ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ దెబ్బకు మూడో వికెట్ పడింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళకు సహకరించారని వెలుగు చూడకముందే ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటున్నది.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ చీఫ్ సూపరెండెంట్ కృష్ణకుమార్ ను బదిలి చేస్తూ సోమవారం కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణకుమార్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని డీఐజీ రూప ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాశారు.

శశికళ దెబ్బకు ఒకే సారి మూడు వికెట్లు

శశికళ దెబ్బకు ఒకే సారి మూడు వికెట్లు

జైల్లో శాఖ డీజీపీ సత్యనారాయణరావు, డీఐజీ రూపను బదిలి చేస్తూ సోమవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరిని బదిలి చేసిన కొన్ని గంటల తరువాత పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ చీఫ్ సూపరెండెంట్ కృష్ణకుమార్ మీద బదిలి వేటు పడింది.

సెంట్రల్ జైల్ చీఫ్ అనిత

సెంట్రల్ జైల్ చీఫ్ అనిత

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ చీఫ్ సూపరెండెంట్ కృష్ణకుమార్ స్థానంలో జైళ్ల శాఖ సీనియర్ అధికారి ఆర్. అనితను నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కృష్ణకుమార్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

వెంటనే వెళ్లిపోవాలి

వెంటనే వెళ్లిపోవాలి

మేము ఆదేశాలు ఇచ్చే వరకు ఎక్కడ విధులలో చేరకూడదని ప్రభుత్వం ఆదేశించింది. బదిలి అయిన వెంటనే రిలీవ్ కావాలని కృష్ణకుమార్ కు ప్రభుత్వం సూచించడంతో ఆయన వెంటనే విధుల నుంచి తప్పుకున్నారు. మీడియాతో మాట్లాడటానికి కృష్ణకుమార్ నిరాకరించారు.

చిన్నమ్మ దెబ్బకు

చిన్నమ్మ దెబ్బకు

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళకు, నకిలి స్టాంపుల కుంభకోణంలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీంలాల్ తెల్గీ దగ్గర మామూళ్లు తీసుకుని వారికి కృష్ణకుమార్ రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

సెంట్రల్ జైల్లో ఏదో జరుగుతోంది

సెంట్రల్ జైల్లో ఏదో జరుగుతోంది

కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణరావు, డీఐజీ రూప, పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చీఫ్ సూపరెండెంట్ కృష్ణకుమార్ ను ఒకే రోజు బదిలి చెయ్యడంతో అక్కడ ఏదో జరుగుతోంది ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కన్నడిగులు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru central jail Chief superintendent Krishna Kumar transferred , R.Anitha named as the replacement.
Please Wait while comments are loading...