పోలీసులే దొంగలు: రూ. లక్షలు దోపిడీకి యత్నం, అరెస్టు

రూ. 66 లక్షల విలువైన పాత, కొత్త నోట్లు లూటీ చెయ్యడానికి ప్రయత్నించిన 8 మంది పోలీసుల మీద బెంగళూరులో కేసులు నమోదు అయ్యాయి. కేసులు నమోదు అయిన వెంటనే పోలీసులను సస్పెండ్ చేశారు.

బెంగళూరు: పాత నోట్లు రద్దు తరువాత చేతివాటం చూపించడానికి ప్రయత్నించిన 8 మంది పోలీసులకు విధుల నుంచి తప్పిస్తూ బెంగళూరు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే పోలీసు అధికారులు సంచలన నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చారు.

రద్దు అయిన పాత నోట్లు రూ. 1,000, రూ. 500 నోట్లను కొత్త రూ. 2,000, రూ. 500 నోట్లుగా మార్చి ఇస్తామని నమ్మించి మోసం చేసి దోపిడీలు చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ 8 మంది పోలీసుల మీద బెంగళూరులోని కలాసిపాళ్య, గిరినగర, మాగడి రోడ్డు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.

Bengaluru cops arrested, fired for swapping old notes

ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 35.50 లక్షలు, మరో పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 8 లక్షలు, మరో పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 22.30 లక్షలు దోపిడీ చెయ్యడానికి ప్రయత్నించడంతో వీరి మీద సెక్షన్ 311 (బి) ప్రకారం కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.

ఈ మూడు దోపిడీల కేసుల్లో సబ్ ఇన్స్ పెక్టర్ ఎన్.సి. మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ మయూర, మంజునాథ్, గిరీష్, చంద్రశేఖర్, అనంతరాజు, రాఘవ కుమార్, శేషు అనే పోలీసుల మీద కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశారు. అందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+