ఈవెంట్ మేనేజ్ మెంట్, రిసార్టుల్లో జరిగేది వేరే, కిలాడీ పారిజాతం
ఈవెంట్ మేనేజ్‌మెంట్ పేరుతో సిలికాన్ సిటీలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ జంటను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రకాష్, పారిజాత దంపతులను విచారణ చేస్తున్నామని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు తెలిపారు. ప్రకాష్, పారిజాత దంపతులు బెంగళూరులోని పట్టేగారపాళ్యలో నివాసం ఉంటున్నారని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.

పేర్లు మార్చుకుని మారు పేర్లతో హైటెక్ వ్యభిచారం వ్యాపారంలోకి దిగిన నిందితులు రాకేష్, పూజ అనికూడా పిలుస్తారని పోలీసులు అన్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన నిరుపేద యువతులకు ఉపాధి కల్పిస్తామని నమ్మించిన నిందితులు వారిని బెంగళూరు నగరానికి రప్పించుకున్నారు. ఉద్యోగం చేస్తే తక్కువ జీతం వస్తుందని, ఆ జీతం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని, రోజు బీర్లు తాగి బిర్యానీలు తినవచ్చు అని, ఇంకా రాత్రి పూట రోజుకు ఒకరితో ఎంజాయ్ చెయ్యవచ్చు అని కొంత మంది యువతులకు పారిజాత మాయమాటలు చెప్పింది.
బెంగళూరు నగరానికి తీసుకొచ్చి ధనవంతులు, వ్యాపారులు, కళాశాల యువకులకు నిరుపేదలు అయిన అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు.
వెడ్డింగ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ పేరుతో నిరుపేద కుటుంబాల్లో ఉన్న యువతులకు నిందితులు గాలం వేస్తున్నారు. బెంగళూరు నుంచి తమిళనాడులోని పాండిచ్చేరికి ప్రతి వారం తీసుకెళ్లి విలాసవంతమైన రిసార్ట్ లో అమ్మాయిలను పెట్టి వారితో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

రిసార్ట్‌లో పార్టీ ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి రూ 25 వేల నుంచి రూ 50 వేల వరకు నిర్ణయించారు. పార్టీకి వెళ్లే వారికి బిర్యానీలు, మద్యం సరఫరా చేస్తున్నారు. ఇక రాత్రి అయితే అదే అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారు.
ఈవెంట్ మేనేజ్‌మెంట్ పేరుతో రాష్ట్రానికి చెందిన యువతులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరుకు చెందిన యువతులను తమిళనాడుకు తీసుకెళ్తుండగా సీసీబీ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం నలుగురు యువతులను పోలీసులు రక్షించారు. నిందితులు ప్రకాష్, పారిజాత దంపతులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ పేరుతో పెద్ద నెట్‌వర్క్ తో కొంత మంది బెంగళూరు నగరంలో హైటెక్ వ్యభిచార దందా సాగిస్తున్నట్లు సమాచారం ఉందని, విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications