బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో కుప్పకూలిన భవనం: 60 శాతం కాలిపోయి మృత్యువుతో పోరాడిన చిన్నారి, చివరికి !

బెంగళూరులో గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనంశిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన మూడేళ్ల చిన్నారి60 శాతం కాలిపోయి మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు వదిలిన సంజనా

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఈజీపురలో మూడు అంతస్తుల భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజనా (3) అనే చిన్నారి చికిత్స విఫలమై మరణించింది. మూడు అంతస్తుల శిథిలాల కింద చిక్కుకున్న సంజనాను అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రాణాలతో రక్షించారు.

అక్టోబర్ 16వ తేదీ జరిగిన గ్యాస్ సిలండర్ పేలుడు ప్రమాదంలో సంజనా 60 శాతం కాలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన సంజనాకు కర్ణాటక ప్రభుత్వం సొంత ఖర్చులతో ఐసీయూలో చికిత్స చేయించింది. గురువారం కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి ఆసుపత్రికి వెళ్లి సంజనా ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

Bengaluru ejipura building collapse 3 year old Sanjana no more

మూడు రోజులు మృత్యువుతో పోరాడిన సంజనా చివరికి ప్రాణాలు వదిలింది. సంజనా ప్రాణాలతో బయటపడాలని కొన్ని వేల మంది చేసిన ప్రార్థనలు వృదా అయ్యాయి. విషయం తెలుసుకున్న కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి, బెంగళూరు మేయర్ సంపత్ రాజ్ ఆసుపత్రి చేరుకుని సంజనా మృతదేహానికి నివాళులు అర్పించారు.

English summary
3 year old Sanjana no more. Sanjana who survived in the building collapsed in Ejipura, Bengaluru
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X