బెంగుళూరులో వైద్యుల నిర్వాకం: సర్జరీ చేస్తే కోమాలోకి వెళ్లిన బాలుడు
బెంగుళూరు: చేతి వేళ్లు నలిగాయని ఆసుపత్రికి వెళితే, అక్కడ వైద్యులు చేసిన ఆపరేషన్‌లో పొరపాటు వల్ల ఐదేళ్ల బాలుడు కోమాలోకి వెళ్లిపోయిన సంఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే లక్షయ్ (5) అనే బాలుడు స్కూల్లో ఆడుకుంటుండగా చేతి వేళ్లు నలగడంతో స్కూలు యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు.
ఇదే విషయాన్ని స్కూలు యాజమాన్యం బాలుడి తండ్రి పురుషోత్తంకి ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మని చెప్పారని ఆయన తెలిపారు. ఆసుపత్రికి వెళ్లేసరికే లక్షయ్ వేళ్లు నలిగిపోయి ఉండటం చూశానని బాలుడి తండ్రి పేర్కొన్నారు. ఆరు గంటల్లోగా బాలుడి చేతి వేళ్లకు ఆపరేషన్ చేయాలని, అందుకోసం వెంటనే రూ. 60 వేలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు.

తమ కుమారుడి ఆపరేషన్‌కు అంగీకరించామని, కొన్ని గంటల తర్వాత ఆపరేషన్ చేసిన వైద్యులు వచ్చి లక్షయ్ ఏదో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారని అన్నారు. అయితే ఆపరేషన్‌కు మందు వరకు తమ కుమారుడు ఎంతో చక్కగా ఉన్నాడని అంతలోనే లక్షయ్‌కి గుండె సంబంధిత వ్యాధి ఎలా వస్తుందని ప్రశ్నించారు.
Bengaluru: It has been nine days & he is still in coma. The hospital didn't call or even ask about my son: Victim's father Purushottam
— ANI (@ANI_news) June 20, 2016
ఆ తర్వాత మళ్లీ వైద్యులు తన వద్దకు వచ్చి లక్షయ్ కోమాలోకి వెళ్లనట్లు చెప్పారని అన్నారు. ఎంచక్కా ఆడుకుంటున్న తన కుమారుడు చేతి వేళ్ల సర్జరీ చేసిన తర్వాత గత తొమ్మిది రోజులుగా కోమాలోనే ఉన్నాడని పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి ఆరోగ్యంపై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని అన్నారు.
Bengaluru: When I went to the hospital, I saw his two fingers were damaged: victim's father Purushottam pic.twitter.com/T3Yesd4Rhf
— ANI (@ANI_news) June 20, 2016
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు కోమాలోకి వెళ్లాడని లక్షయ్ తల్లిదండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.












Click it and Unblock the Notifications