Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

madam: డ్రమ్ లో లేడీ శవం, మేడమ్ అడ్రస్ చిక్కింది, కేర్ ఆఫ్ కలాసిపాళ్య, భర్తను వదిలేసి ?

బెంగళూరు సిటీలో మహిళల వరుస హత్యలతో ప్రజలు హడలిపోయారు. ఇటీవల హత్యకు గురైన వివాహిత మహిళ బెంగళూరుకు చెందినది అని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు/కేఆర్ పురం: బెంగళూరు సిటీలో మహిళల వరుస హత్యలతో ప్రజలు హడలిపోయారు. మహిళలను హత్య చేసిన నిందితులు వారి శవాలను ప్లాస్టిక్ డ్రమ్ లో పెట్టి నీట్ గా సీల్ చేసి ఆ డ్రమ్ లు రైల్లేస్టేన్ లో వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు మరో మహిళ శవం రైల్వేస్టేషన్ లోని డ్రమ్ లో చిక్కడంతో రైల్వే ప్రయాణికులు. బెంగళూరు ప్రజలు హడలిపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో మహిళలను హత్య చేసి ఆ శవాలను బెంగళూరుకు తీసుకు వచ్చి వదిలివెళ్లిపోతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల హత్యకు గురైన వివాహిత మహిళ బెంగళూరుకు చెందినది అని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం

ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం

బెంగళూరు నగరంలోని బయ్యప్పనహళ్లి రైల్వేస్టేషన్ సమీపంలోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్ మెయిన్ గేట్ సమీపంలోని ఫ్లాట్ ఫామ్ లో ప్లాస్టిక్ డ్రమ్ నుంచి దుర్వాసన వస్తోందని గమనించిన రైల్వే ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీల్ చేసిన డ్రమ్ ఓపెన్ చేసి పరిశీలించగా అందులో మహిళ శవం బయటపడింది.

సీసీటీవీ కెమెరాల్లో ?

సీసీటీవీ కెమెరాల్లో ?

సుమారు 35 ఏళ్ల యహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి శవాన్ని డ్రమ్ లో ప్యాక్ చేసి తీసుకవచ్చి రైల్వేస్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయారని రైల్వే శాఖ ఎస్పీ సౌమ్యా లతా ఆరోజు మీడియాకు చెప్పారు. మహిళ శవాన్ని డ్రమ్ లో పెట్టుకుని ఆడ్రమ్ ఆటోలో పెట్టుకుని రైవ్వేస్టేషన్ కు వచ్చారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, ఆ సీసీటీవీ క్లిప్పింగ్స్ పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నామని రైల్వే శాఖ ఎస్పీ సౌమ్యా లతా అన్నారు.

శవం రైల్వేస్టేషన్ లో ఉంటే సేఫ్ అని ధీమా

శవం రైల్వేస్టేషన్ లో ఉంటే సేఫ్ అని ధీమా

బెంగళూరులోని యశవంతపురంలోని రైల్వేస్టేషన్ తో పాటు పలు రైల్వే స్టేషన్లలో వరుసగా మహిళల శవాలు బయటపడుతుండటంతో రైల్వే ప్రయాణికులు హడలిపోతున్నారు. నవంబర్ 1వ తేదీన మహిళ శవాన్ని గోనె సంచిలో మూటకట్టి ఆ శవం ప్లాస్టిక్ డ్రమ్ లో ప్యాక్ చేసి తీసుకు వచ్చి రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద వదిలేసి వెళ్లిపోయారు. డిసెంబర్ 24వ తేదీ అర్దరాత్రి దాటిన తరువాత మరో మహిళ శవాన్ని ప్లాస్టిక్ డ్రమ్ లో ప్యాక్ చేసి తీసుకు వచ్చి యశవంతపురం రైల్లేస్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మరో మహిళ శవం చిక్కడంతో పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలించారు.

మహిళది బెంగళూరు

మహిళది బెంగళూరు

ఇటీవల మహిళ శవం ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ ను రైల్వేస్టేషన్ లో వదిలి వెళ్లిపోతున్న నిందితులు సీసీటీవీ కెమెరాల్లో చిక్కారు. హత్యకు గురైన మహిళ బెంగళూరు సిటీ మార్కెట్ సమీపంలోని కలాసిపాళ్యలో నివాసం ఉంటున్నది పోలీసులు అన్నారు. వివాహం చేసుకుని పిల్లలకు తల్లి అయిన తరువాత ఆమె భర్తను వదిలేసిందని పోలీసులు అన్నారు. పిల్లలతో కలిసి వేరేగా ఉంటున్న మహిళకు అక్రమ సంబందం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

నీట్ గా చంపేశాడు

నీట్ గా చంపేశాడు

భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న మహిళతో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు అన్నారు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళ ఆమె ప్రియుడిని కలిసిందని, అదే రోజు ఆమెను హత్య చేశారని పోలీసులు అన్నారు. మహిళ హత్య కేసులో ఆమె ప్రియుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని బయ్యప్పనహళ్లి రైల్వే పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+