
Bengaluru: రిటైడ్ ఎస్పీకి రూ. 1 కోటి జరిమానా, 4 ఏళ్లు జైలు శిక్ష, అక్రమాస్తుల కేసు, 15 ఏళ్లకు !
బెంగళూరు: ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని వెలుగు చూడటంతో రిటైడ్ పోలీస్ ఎస్పీకి రూ. 1 కోటి జరిమానా, నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తరువాత రిటైడ్ ఎస్పీ సీఏ. శ్రీనివాస్ అయ్యర్ కు బెంగళూరు కోర్టు జైలు శిక్ష విధించింది.
Wife: భార్యకు అక్రమ సంబంధం, ప్రియుడి దగ్గర రూ. 30 లక్షలు స్వాహా, క్లైమాక్స్ లో భార్య,భర్త !

1973లో ఉద్యోగం
ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని రిటైడ్ ఎస్పీ శ్రీనివాస్ అయ్యర్ మీద 2007లో లోకాయుక్త కేసు నమోదు చేసింది. 1973లో డీఎస్పీగా కర్ణాటక పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరిన శ్రీనివాస్ అయ్యర్ తరువాత వివిద ప్రాంతాల్లో ఉద్యోగం చేశారు. 2007లో యలహంకలోని పోలీసు ట్రైనింగ్ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించారు.

2007లో లోకాయుక్త అధికారుల దాడులు
2007లో లోకాయుక్త అధికారులు అప్పటి పోలీసు అధికారి శ్రీనివాస్ అయ్యర్ ఇంట్లో, ఆఫీసులో సోదాలు చేశారు. ఆ సందర్బంలో శ్రీనివాస్ అయ్యర్ రూ. 81. 92 లక్షలు సంపాదించారని, అందులో రూ. రూ. 34.44 లక్షలు ఖర్చు చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఆ సందర్బంలో శ్రీనివాస్ అయ్యర్ అక్రమంగా ఆస్తులు సంపాధించారని వెలుగు చూసింది.

రూ. 40 లక్షలకు లెక్కలు లేవు
రూ. 1. 16 కోట్లు సంపాధించిన శ్రీనివాస్ అయ్యర్ అందులో రూ. 75. 77 లక్షలకు లెక్కలు చూపించారని, మిగిలిన రూ. 40. 60 లక్షలకు లెక్కలు చూపించలేకపోయారని అప్పట్లో లోకాయుక్త అధికారులు ఆయన మీద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతోంది.

రూ. 1 కోటి జరిమానా, నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష
రిటైడ్ ఎస్పీ శ్రీనివాస్ అయ్యర్ ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని వెలుగు చూడటంతో ఆయకు రూ. 1 కోటి జరిమానా, నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరులోని 78వ సీసీహెచ్ కోర్టు న్యాయమూర్తి ఎస్.వి. శ్రీకాంత్ సంచలన తీర్పు చెప్పారు. రూ. 1 కోటి అపరాద రుసుం చెల్లించని పక్షంలో శ్రీనివాస్ అయ్యర్ మరో రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.