బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాల్ పై ఐటీ దాడులు: రూ. 169 కోట్ల అక్రమ ఆస్తి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రెండు ప్రముఖ మాల్స్ యాజమానులు, స్థిరాస్థి వ్యాపారులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. డిసెంబర్ 23 నుంచి 26వ తేది రాత్రి వరకు జరిగిన ఐటీ సోదాలలో రూ. 169 కోట్ల విలువైన అప్రకటిత ఆదాయం గుర్తించారు.

ఓ ప్రముఖ మాల్ నిర్వహకులు కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు రూ. 143 కోట్ల విలువైన అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారు. ఆ మాల్ యాజమాన్యం మొదట ప్రభుత్వానికి లెక్కల్లో చూపించిన దాని కంటే రూ. 143 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించామని అధికారులు తెలిపారు.

Bengaluru: IT detects Rs 169 crore black income after raids on mall

రెండవ కేసులో అక్రమ ఆదాయంగా చూపిస్తున్న రూ. 26 కోట్లు గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు. వీరి ఆదాయ పన్నుశాఖకు తెలిపిన వివరాల ప్రకారం రూ. 500 కోట్ల వ్యాపారం చేస్తున్నారని, సోదాల్లో అదనంగా రూ. 169 కోట్ల అక్రమ ఆదాయం చూపిస్తున్నారని అధికారులు తెలిపారు.

అక్రమ ఆదాయంతో వీరు బంగారు నగలు, బంగారు బిస్కెట్లు కొనుగోలు చేశారని, తమ సొంత ఖర్చులను వాణిజ్య వ్యయాలుగా చూపించారని, దర్యాప్తు జరుగుతుందని ఐటీ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. సోదాలలో రూ. కోట్ల విలువైన రూ. 2,000 కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

English summary
The disclosure in this cases stands at Rs 143 crore, a senior official said. In the second group, the official added, The assesses were found to have not disclosed income to the extent of Rs 26 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X