వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: విధాన సౌధలోకి ఆ ‘కాయ’నిషేధం, నాయకుల చేతుల్లో ట్రింగ్ ట్రింగ్, పోలీసుల నవ్వులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిపాల విభాగాల కేంద్రం విధాన సౌధ గురించి మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. అయితే రాజకీయాల గురించి కాదు, రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలు అంతకంటే కాదు, ప్రతిరోజూ తమ సమస్యలను పరిష్కరించాలని విధాన సౌధలోకి వెలుతున్న ప్రజల గురించి. ఎవరైనా సరే, విధాన సౌధలోకి నిమ్మ కాయలు లేదా నిమ్మపండ్లు తీసుకురాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడం నవ్వు తెప్పిస్తోంది.

ఆశ్చర్యానికి గురి చేస్తున్న ప్రభుత్వ ఆదేశాలు గురించి తెలుసుకున్న ఉద్యోగులు, ప్రజలు షాక్ కు గురైనారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల కార్యాలయాలు విధాన సౌధలో ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీ అక్కడే ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని మనవి చేస్తూ ప్రతిరోజూ ప్రజలు విధాన సౌధ ముందు క్యూ కడుతుంటారు.

అందరి ఆటలు నాకు తెలుసు, కళ్లు మూసుకుని రాజకీయాలు చేస్తారా ? చూద్దాం: త్రిబుల్ షూటర్ !అందరి ఆటలు నాకు తెలుసు, కళ్లు మూసుకుని రాజకీయాలు చేస్తారా ? చూద్దాం: త్రిబుల్ షూటర్ !

 నిమ్మకాయలు సీజ్

నిమ్మకాయలు సీజ్

విధాన సౌధలోని అన్ని గేట్ల (ప్రవేశ ద్వారాలు) దగ్గర లోపలికి వెలుతున్న అధికారులు, ఉద్యోగులు, ప్రజలను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారి బ్యాగులు, జోబుల్లో నిమ్మకాయలు, నిమ్మపండ్లు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.

మేము మాత్రం ఏం చేస్తాం !

మేము మాత్రం ఏం చేస్తాం !

సార్, ఏమిటిది అని ప్రజలు ప్రశ్నిస్తే మేము మాత్రం ఏం చేస్తాం, ప్రభుత్వ ఆదేశాలు అలా ఉన్నాయంటూ పోలీసులు సమాధానం ఇవ్వడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురౌతున్నారు. విధాన సౌధలోకి నిమ్మకాయలు, నిమ్మపండ్లు నిషేధించిన తరువాత ప్రతిరోజూ పోలీసులు దాదాపు 30 నుంచి 40 వరకు నిమ్మకాయలు లేదా నిమ్మపండ్లు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఆత్మహత్యా యత్నం చేస్తారని !

ఆత్మహత్యా యత్నం చేస్తారని !

ఒక్కోరోజు స్వాధీనం చేసుకునే నిమ్మకాయల సంఖ్య 50 దాటిపోతుందని అక్కడ పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది అంటున్నారు. విధాన సౌధలోనికి వచ్చే కొందరు ఎక్కడ సహనం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుకోవడానికి ప్రయత్నిస్తారో అనే ఆందోళనతో ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఔషదాలు, మాత్రలు, బ్లేడ్లు, కత్తులు, కిరొసిన్, పెట్రోల్ లాంటివి వస్తులు నిషేధించింది.

సెక్యూరిటీ సిబ్బంది

సెక్యూరిటీ సిబ్బంది

ఇప్పుడు ఆ జాబితాలోకి నిమ్మకాయలు, నిమ్మ పండ్లు చేరడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఎవరైనా నిమ్మకాయలు, నిమ్మ పండ్లు తీసుకుని విధాన సౌధ దగ్గరకు వెలితే ప్రవేశ ద్వారం దగ్గర అక్కడ ఉన్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందికి వాటిని అప్పగించి లోపకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 పోలీసుల నవ్వులు

పోలీసుల నవ్వులు

విధాన సౌధలోకి నిమ్మకాయలు లేదా నిమ్మపండ్లు తీసుకెళ్లడం ఎందుకు నిషేధించారు అంటే అక్కడ ఉన్న పోలీసులు, సెక్యూటి సిబ్బంది నవ్వే సామాధానం అయ్యింది. కర్ణాటకలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు నిత్యం నిమ్మకాయలు చేతిలో పట్టుకుని విధాన సౌధలో ట్రింగ్ ట్రింగ్ అంటూ దర్శనం ఇస్తుంటారు.

చేతబడి చేశారనే భయం ?

చేతబడి చేశారనే భయం ?

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో విధాన సౌధ ముందు చేతబడి చేశారని ప్రచారం జరిగింది. తరువాత విధాన సౌధలోకి నిమ్మకాయలు, నిమ్మ పండ్లు తీసుకెళ్లడం నిషేధించారు. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిమ్మకాయల నిషేధాన్ని ఎత్తివేశాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ నిమ్మకాయలు, నిమ్మపండ్లు విధాన సౌధలోకి తీసుకెళ్లడం నిషేధించడంతో మరోసారి చర్చకు దారితీసింది.

English summary
Lemon not allowed in Vidhana Soudha the seat of the state legislature. If people carry lemon police will collect in at the entrance gate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X