Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రముఖ మోడల్ దారుణ హత్య, బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ అరెస్టు, లేడీ ఉంగరం!

బెంగళూరు: బెంగళూరులో దారుణ హత్యకు గురైన పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ మోడల్ హత్య కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతాలోని న్యూటౌన్ నివాసి పూజా సింగ్ హత్య కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ను బెంగళూరులోని బాగలూరు పోలీసులు అరెస్టు చేశారు. పూజా సింగ్ ఉంగరం ఓలా క్యాబ్ డ్రైవర్ ను పట్టించింది.

బెంగళూరు నడర శివార్లలో పూజా సింగ్ హత్యకు గురైయ్యింది. ఇదే కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ఎం. నాగేష్ (22) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాడయరపనహళ్ళిలో పూజా సింగ్ మృతదేహాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

జులై 31వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో బెంగళూరులోని క్రెసెంట్ రోడ్డులో ప్రముఖ మోడల్ పూజా సింగ్ నాగేష్ క్యాబ్ లో ఎక్కింది. క్రెసెంట్ రోడ్డు నుంచి పరప్పన అగ్రహార చేరుకున్న పూజా సింగ్ అక్కడే కారు దిగింది. మరుసటి రోజు వేకువ జామున 4 గంటలకు తాను ఎయిర్ పోర్టుకు వెళ్లాలని, నీవే ఇక్కడకు వచ్చి తనను పిక్ చేసుకోవాలని పూజా సింగ్ ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ కు చెప్పింది.

Bengaluru police arrested Ola cab driver in connection with the murder of Kolkata based model.

మరుసటి రోజు వేకువ జామున నాలుగు గంటలకు పూజా సింగ్ ఉంటున్న చోటకు వెళ్లిన ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ ఆమెను కారులో పిలుచుకుని ఎయిర్ పోర్టు దగ్గరకు బయలుదేరాడు. మార్గం మధ్యలో తనకు డబ్బులు, నగలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ మోడల్ పూజా సింగ్ ను బెదిరించాడు.

నగదు, నగలు ఇవ్వడానికి నిరాకరించిన పూజా సింగ్ మీద ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ జాక్ రాడ్ తో దాడి చేశాడు. పూజా సింగ్ శరీరం మీద కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. తరువాత కాడయరపనహళ్ళి ప్రాంతానికి పూజా సింగ్ మృతదేహాన్ని తీసుకెళ్లి ముఖం మీద బండరాళ్లు వేసి గుర్తు పట్టని విదంగా చేశాడు.

పూజా సింగ్ మృతదేహాన్ని కాడయరపనహళ్ళిలో విసిరేసిన ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ అక్కడి నుంచి పరారైనాడు. గుర్తు తెలియని మహిళ మృతదేహం అని పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత పూజా సింగ్ కనపడటం లేదని ఆమె భర్త కోల్ కతాలో నగరంలోని న్యూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుమానస్పదంగా తిరుగుతున్న నాగేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నాగేష్ చేతిలో ఉన్న ఉంగరం (పూజా సింగ్ ఉంగరం) పరిశీలించగా అలాంటి ఉంగరాలు పశ్చిమ బెంగాల్ మహిళలు పెట్టుకుంటారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కోల్ కతా పోలీసులను సంప్రదించగా పూజా సింగ్ మాయం అయిన కేసు విషయం తెలిసిందని, పూజా సింగ్ ను తానే హత్య చేశానని ఓలా క్యాబ్ డ్రైవర్ నాగేష్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+