వినాయకుడిని అరెస్టు చేసి చరిత్రలో నిలిచిపోయిన పోలీసులు, దేశంలో ఫస్ట్ టైమ్
గణేష్ చతుర్థి (వినాయక చవితి) పండుగ భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటి. వినాయక చవితి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సాధారణంగా వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు. ఎవరిని వీలును బట్టి వాళ్లు ఒక్కరోజు, మూడు రోజులు, ఐదు రోజులు, తొమ్మిది రోజులు, 11 రోజుల పాటు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి తరువాత ఆఖరు రోజు నీటిలో విసర్జించడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే అందరి కష్టాలు తీర్చే వినాయకుడికి ఈసారి పండుగ శకునం ఎదురైయ్యింది. వినాయకుడిని వీధుల్లో ప్రతిష్టించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది. అయితే ఖైదీలను పోలీసుల వ్యాన్ ఎక్కించినట్లు వినాయకుడిని పోలీసు వ్యాన్ ఎక్కించడం కలకలం రేపింది. బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్టు చేసి చరిత్రలో నిలిచిపోయారు. బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్టు చేసి పోలీసుల వ్యాన్ లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఊరేగింపులో ఉండాల్సిన వినాయకుడు పోలీసు వ్యానులో కూర్చొని ఉన్న ఫోటో ఒకటి సంచలనం సృష్టించింది. శాంతియుతంగా నీటిలో మునిగిపోవాల్సిన వినాయకుడిని పోలీసులు వ్యాన్ ఎక్కించడంతో మా వినాయకుడికి ఎన్ని కష్టాలు వచ్చాయిరా దేవుడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పోలీస్ వ్యాన్‌లో ఖైదీగా ఉన్న గణేశుడి విగ్రహం ఫోటో ఎక్కడిది అని అందరూ ఆరా తీస్తున్నారు. ఈ ఘనకార్యం చేసింది బెంగళూరు పోలీసులు అని తెలుసుకుని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మండ్యలోని నాగమంగళలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ కొందరు హిందూ కార్యకర్తలు బెంగళూరులో నిరసన తెలిపారు. ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని నిరసనకారులు వారి వెంట తీసుకెళ్లారు. తొలుత ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా తమ వద్ద ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఆందోళనకారులు వారి చేతుల్లో పెట్టుకున్నారు. అయితే పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి ఆందోళనకారులతో పాటు వినాయకుడిని అరెస్టు చేసి పోలీసు వ్యాన్ ఎక్కించారు.

అక్కడున్న వారు ఫొటోలు తీసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో వైరల్ అయ్యాయి. హిందూ కార్యకర్త పునీత్ కెరెహళ్లి నేతృత్వంలో బెంగళూరులో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ వీడియోను షేర్ చేసిన పునీత్ కెరెహళ్లి మా వినాయకుడిని అరెస్ట్ చేసిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయిందని ఆరోపించారు. బహుశా దేశంలో ఎక్కడకూడా ఇంత వరకు వినాయకుడిని అరెస్టు చెయ్యలేదని, బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్టు చేసి గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాధించాలని ప్రయత్పిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తన్నాయి.
మండ్యలో ఏం జరిగిందంటే ?
కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగల పట్టణంలో వినాయకుడి నిమజ్జనం సందర్బంగా ఊరేగింపు జరిగింది. నాగమంగల పట్టణంలోని చామరాజనగర- జీవర్గి జాతీయ రహదారిలోకి వినాయకుడి విగ్రహం ఊరేగింపు వచ్చిన సందర్బంగా ఓ వర్గం వాళ్లు రాళ్లతో దాడి చేశారు. ఆ సందర్బంలో హిందూ సంఘాలు, కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాలు రాళ్లు, బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు నాలుగైదు సార్లు లాఠీలు ప్రయోగించి పరిస్థితిని అదుపు చేసేందుకు నానాతంటాలు పడ్డారు.
నాగమంగళలోని టీబీ ఏరియాలో గజపడే యువజన సంఘం ఆధ్వర్యంలో గణేశ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం బదరికొప్పల నుంచి బీజీఎస్ సర్కిల్ మీదుగా వినాయకుడి విగ్రహం ఊరేగింపు మొదలైయ్యింది. చామరాజనగర్- జీవర్గి జాతీయ రహదారిపై జానపద కళాబృందాలతో ర్యాలీగా వెలుతున్న సమయంలో పరిస్థితి చెయ్యిదాటింది.
ಈ ಗುಲಾಮಗಿರಿಯ ಇಟ್ಲರ್ ಸರ್ಕಾರ ನಮ್ಮ ಗಣೇಶನನ್ನು ಬಂಧಿಸುವ ಮೂಲಕ ನಾಡಿನಲ್ಲಿ ಇರುವುದು ಕಾಂಗ್ರೆಸ್ಸ್ ನ ಮುಲ್ಲಾ ಸರ್ಕಾರ ಎಂದು ಸಾಬೀತು ಪಡಿಸಿತು! ನಾಗಮಂಗಲದಲ್ಲಿ ಗಣೇಶ ವಿಸರ್ಜನ ಮೆರವಣಿಗೆಯಲ್ಲಿ ಹಿಂದೂಗಳ ಮೇಲೆ ನೆಡೆದ ಘಟನೆ ಖಂಡಿಸಿ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಹಿಂದೂ ಸಂಘಟನೆಗಳು ಹೋರಾಟ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೆವು ಅದರೆ ಜಿಹಾದಿಗಳ ಅಂಡು ತೊಳೆಯುವ ಸರ್ಕಾರ… pic.twitter.com/QwIIgPorjK
— Puneeth Kerehalli (@Puneeth74353549) September 13, 2024
మండ్య సర్కిల్ తాలూకా ఆఫీసు సమీపంలోకి వెళ్లిన తరువాత మైసూరు రోడ్డులో సుమారు రెండు వందల మీటర్ల దూరం వెళ్లి యూ టర్న్ తీసుకుని అక్కడి నుంచి దర్గా వైపు వినాయకుడి విగ్రహం వెలుతోంది. ఆ సందర్బంలో వినాయకుడి విగ్రహాన్ని ఊరేగిస్తున్న వారిపై ఓ వర్గం వాళ్లు ఒక్కసారిగా రాళ్లు, గాజు బాటిళ్లతో దాడి చేశారు.
దీంతో కోపోద్రిక్తులైన హిందూ యువకుల బృందం దుండగులపై రాళ్లు రువ్వింది.
అదే సమయంలో వినాయకుడి విగ్రహం ఊరేగింపు చేస్తున్న వాళ్లపై ముస్లిం యువకులు రాళ్లతో దాడి చేశాయి. దీనిపై స్పందించిన హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఎదురుదాడికి దిగారు. ఈ సంఘటనపై కర్ణాటకలోని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం హిందువులను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కూడా ఆరోపించింది.












Click it and Unblock the Notifications