అక్రమ సంబంధం, ఆంటీని హత్య చేసి 31 ఏళ్లకు చిక్కిన భర్త, మతం మార్చుకుని ఏం చేశారంటే ?
బెంగళూరులో నివాసం ఉండే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం కావడంతో అతని భార్యతో సంతోషంగానే కాపురం చేశాడు. దంపతుల ఇంటికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లారు. సంతోషంగా జీవనం సాగిస్తున్న దంపతుల కాపురంలో చిచ్చు మొదలైయ్యింది. అంతే భార్యను చంపేసిన భర్త ఎస్కేప్ అయ్యాడు. అయితే 31 ఏళ్ల తరువాత భర్త పోలీసులకు చిక్కాడు.
భార్యను హత్య చేసిన భర్త చాలా చకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. అయితే ఇంతకాలం తలదాచుకున్న భర్త గురించి 31 ఏళ్ల తర్వాత అతపి ఆచూకీ లభించింది. బెంగళూరులో నివాసం ఉంటున్న భార్య సుధా శీలంపై అనుమానంతో ఆమె భర్త సుబ్రమణి రగిలిపోయాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని అనుమానంతో సుబ్రమణి నిత్యం అతని భార్య సుధాతో గొడవపెట్టుకున్నాడు.

ఇదే విషయంలో సుబ్రమణి, సుధా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి, ఎంత చెప్పినా భార్య సుధా పద్దతి మార్చుకోలేదని రగిలిపోయిన సుబ్రమణి ఆవేశంతో 1993లో అతని భార్య సుధాను దారుణంగా హత్య చేశాడు. హంతకుడు సుబ్రమణిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కొంతకాలం కేసు విచారణ జరిగింది. తరువాత భార్య సుధా హత్య కేసులో సుబ్రమణి బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చేశాడు.
కొంతకాలం కోర్టు విచారణకు హాజరైన సుబ్రమణి తరువాత సూపర్ స్కెచ్ వేశాడు. బెయిల్ పొందిన సుబ్రమణి తరువాత కోర్టు విచారణకు హాజరుకాకుండా అదృశ్యమయ్యాడు. బెంగళూరు నుంచి కేరళకు పారిపోయిన సుబ్రమణి అక్కడే తలదాచుకున్నాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితుడు వేరే మతం స్వీకరించి ఆ మతం ఆచారాలు, ఆచార వ్యవహారాలను అనుసరించి తప్పించుకున్నాడని తెలిసింది.

సుబ్రమణి అతని పేరును కూడా మార్చుకుని కేరళలో నివసించాడు. కొన్నేళ్ల క్రితం చిక్కమగళూరు వచ్చి ఉంటున్నాడు. ఓ స్థలం విక్రయిస్తున్న సమయంలో పోలీసులకు సుబ్రమణి ఆచూకీ లభ్యమైంది. 31 ఏళ్ల తర్వాత సుబ్రమణిని హెబ్బాళ పోలీసులు పట్టుకున్నారు. భార్య సుధా హత్య కేసులో ఏకంగా 31 ఏళ్ల పాటు తప్పించుకుని తిరిగిన సుబ్రమణి ఆస్తి విక్రయించచే సమయంలో పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.












Click it and Unblock the Notifications