రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ట్విస్ట్, సీసీటీవీ కెమెరాల్లో, పట్టుకున్న పోలీసులు!
రుచికరమైన దక్షిణ భారత వంటకాలను రుచి చూడటానికి 'ది రామేశ్వరం కేఫ్' ముందు ప్రతిరోజు ప్రజలు క్యూ కడుతున్నారు. అలంటి రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మద్యాహ్నం బాంబు పేలుడు జరగడంతో పోలీసులు బాంబును అమర్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరగడంతో బెంగళూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు.
బెంగళూరు నగరంలోని మారతహళ్లి- వైట్ ఫీల్డ్ సమీపంలోని కుందనహళ్లిలోని రామేశ్వర్ కేఫ్‌లో మార్చి 1వ తేదీ శుక్రవారం మద్యాహ్నం బాంబును అమర్చిన నిందితుడిని బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.55 గంటల ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో ఉంచిన బ్యాగ్‌లో ఉన్న రెండు తేలికపాటి బాంబులు పేలడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ బాంబు పేలుడులో ముగ్గురు మహిళలతో సహా మొత్తం 9 మంది గాయపడగా వారిలో స్వర్ణాంబ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటన జరిగిన తర్వాత బెంగళూరు పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు, నేషనల్ కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీజ్ చేసిన హోటల్, పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో బాంబు అమర్చిన వ్యక్తి ముఖం, అతని ఆనవాళ్లు లభ్యమైనాయి.
నిందితుడిని అరెస్టు చేసే బాధ్యతను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కనుగొనడానికి సీసీబీ అధికారుల 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి నిందితుడు బెంగళూరు వదిలిపారిపోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిరంతర సోదాల అనంతరం నిందితుడి ఆచూకీ లభించడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.

ముమ్మరంగా సోదాలు చేసిన పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే సమయంలో రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుల కదలికలపై పోలీసు కమాండ్ సెంటర్‌లోని క్లిప్పింగ్స్ పరిశీలించి ఆధారాలు సేకరించి తరువాత బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. రామేశ్వరం కేఫ్‌మార్గ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను కమాండో సెంటర్ సిబ్బంది పరిశీలించారు.
రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య , హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ కు సమాచారం అందించామని ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అలోక్ మోహన్ తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం పూర్తి సమీక్ష నిర్వహించి సమాచారం అందించిన తర్వాత మరిన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి.
విచారణ అనంతరం నిందితులు ఏం తీసుకొచ్చారనేది తేలనుంది. మేము పేలుడు గురించి ఎన్ఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం అందించామని డీజీపీ అలోక్ మోహన తెలిపారు. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నామని డీజీపీ మీడియాకు చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications