రోజూ భర్తకు సెక్సువల్ టార్చర్.. ఆ వీడియోలు చూపించి ఇలా చేయాలని..!
సాధారణంగా వైవాహిక జీవితంలో మహిళలు వేధింపులకు గురవ్వడం చూస్తుంటాం. కానీ బెంగళూరులో ఓ భర్త తన భార్యపై చేసిన ఆరోపణలు సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. నగరబావికి చెందిన 37 ఏళ్ల వ్యక్తి తన భార్య శిల్ప తనను లైంగికంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తోందని జక్కూరు పోలీసులను ఆశ్రయించాడు. ఆమె తనకు అశ్లీల వీడియోలు పంపిస్తూ.. వాటిలో ఉన్నట్లుగానే ప్రవర్తించాలని ఒత్తిడి చేసేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతే కాకుండా.. ఆమె తన ఓ స్నేహితుడితో శృంగార కృత్యాల్లో పాల్గొనాలని తనను బలవంతం చేసేదని.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి తెచ్చేదని బాధితుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
వివాహేతర సంబంధాలు
తన భార్య కేవలం లైంగికంగానే కాకుండా మానసికంగా కూడా తనను క్రూరంగా హింసించేదని బాధితుడు వెల్లడించాడు. తన సంపాదన తక్కువగా ఉందని.. ఆమె విలాసవంతమైన జీవనశైలికి సరిపడా డబ్బులు ఇవ్వలేకపోతున్నానని ప్రతిరోజూ ఎగతాళి చేసేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె నిరంతరం తన ధనిక స్నేహితులతో గడుపుతూ తనను చిన్నచూపు చూసేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వీటన్నింటికీ తోడు ఆమె తన మాజీ ప్రియులతో ఇంకా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తనతో స్వయంగా ఒప్పుకుందని.. తన ప్రైవేట్ విషయాలను ఇతరులతో పంచుకుంటూ తనను మానసిక క్షోభకు గురిచేసేదని ఆరోపించాడు.

అత్తమామల జోక్యం
ఈ వివాదంలో అత్తమామల పాత్ర కూడా ఉందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన అత్త ఆశా తమ వ్యక్తిగత జీవితంలో విపరీతంగా జోక్యం చేసుకునేదని.. తన కూతురికి అంతకంటే మంచి సంబంధం చూస్తానని.. తనను వదిలేసి వెళ్లిపోవాలని నిరంతరం రెచ్చగొట్టేదని తెలిపాడు. ఇక మామ మాధవ కృష్ణ ఏకంగా మనుషులను పంపి తనను బెదిరించాడని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కుటుంబ కలహాల కారణంగా తాము ఉంటున్న విల్లాలోకి తనను రాకుండా అడ్డుకున్నారని.. అత్తమామల ప్రోద్బలంతోనే భార్య తనపై ఈ స్థాయిలో విరుచుకుపడేదని ఆరోపించాడు.
భర్త రోడ్డున పడిన వైనం!
గతేడాది సెప్టెంబర్ 24న తనను కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్లగొట్టారని బాధితుడు వాపోయాడు. కేవలం తన ల్యాప్‌టాప్, యూనిఫాం తప్ప మరేమీ తీసుకెళ్లనివ్వలేదని తెలిపాడు. తన వద్ద ఉండాల్సిన రూ.1.87లక్షల నగదు, సుమారు 100 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను భార్య తన వద్దే ఉంచుకుందని ఆరోపించాడు. వీటన్నింటికంటే ముఖ్యంగా తన పాస్‌పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లను కూడా ఆమె లాక్కుందని.. ల్యాప్‌టాప్‌లో ఉన్న తమ పెళ్లి ఫోటోలు, వీడియోలను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసి తనను మరింత కుంగదీసిందని బాధితుడు పోలీసులకు వివరించాడు.
ముదురుతున్న చట్టపరమైన పోరాటం
ఈ ఫిర్యాదును నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ కేసులో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. భర్తపై భార్య కూడా తమిళనాడులో తీవ్రమైన ఆరోపణలతో కౌంటర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరువురి మధ్య కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. ఇది కేవలం ఆస్తుల గొడవనా లేక నిజంగానే లైంగిక వేధింపులు జరిగాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన ఈ వింత వివాదం ఇప్పుడు కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications