సిద్దూ, డీకేతో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నారంటే ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా శనివారం మద్యాహ్నం 12. 30 గంటలకు సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా అదే రోజు ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణస్వీకారోత్సవానికి సుమారు లక్ష మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరు అవుతారని నాయకులు అంటున్నారు.
ఇదే సమయంలో 10 మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. సిద్దరామయ్య వర్గంలో, డీకే శివకుమార్ వర్గంలో మంత్రి పదవులు ఆశిస్తున్నా నాయకులు చాల మంది ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలకు మొదటి విడతలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం.

ఇదే సమయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గంలోని ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశీస్సులతో కొందరు మంత్రులు అవుతున్నారు. ఇప్పటికే మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు లాబీలు మొదలుపెట్టారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను ప్రసన్నం చేసుకుని మంత్రులు అయ్యి మంచి ఖాతాలు తీసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు మంత్రివర్గం మొదటి విడతలో 10 మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెందిన ఓ నాయకుడు అంటున్నారు. సిద్దరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గంలోని కొందరు నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసించిన నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కుమారుడు ప్రియాంక ఖార్గే, దళిత నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, కేంద్ర మాజీ మంత్రి, దేవనహళ్లి ఎమ్మెల్యే కేహెచ్. మునియప్ప, విధానపరిషత్ ప్రతిపక్ష నాయకుడు బీకే. హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేజే. జార్జ్, లింగాయత్ నాయకుడు ఎంబీ. పాటిల్, కేసీసీసీ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ఖండ్రే, హళియాళ ఎమ్మెల్యే ఆర్ వీ. దేశ్ పాండేకి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
అలాగే ముస్లీం నాయకుడు, బెంగళూరు చామరాజపేట్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్, రామలింగారెడ్డి, కృష్ణభైరేగౌడ, అజయ్ సింగ్, యూటీ ఖాదర్ మొదటి విడతలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలిసింది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. అయితే మొదటి విడతలో 10 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని, తరువాత మిగిలిన నాయకులకు మంత్రి పదవులు ఇవ్వాలని సిద్దరామయ్య, డీకే శివకుమార్ నిర్ణయించారని తెలిసింది.












Click it and Unblock the Notifications