అన్నతో ఆడుతుండగా: ఆరేళ్ల బాలికపై హైస్కూల్ విద్యార్థులు రేప్

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో మరో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలిక పైన ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బన్నేర్ ఘట్టా సమీపంలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం ఆ బాలిక తన అన్నయ్య, ఇద్దరు బాలురతో కలిసి ఆడుకుంటోంది.

ఆ సమయంలో ఆ ఇద్దరు బాలురు ఆ బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకు వెళ్లారు. అక్కడ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ బాలిక అన్నయ్య ఆ తర్వాత గుర్తించి, తల్లిదండ్రులకు చెప్పాడు.య బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిలో ఒకరిని అదే రోజు అరెస్టు చేశారు.

Bengaluru: Six year old girl raped by high school boys

బాలిక కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని బెంగళూరు (రూరల్) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తెలిపారు. కాగా, ఇద్దరు నిందితులు కూడా మైనర్లు. ఒకరిని అరెస్టు చేశామని, మరో విద్యార్థి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఏడేళ్ల బాలికపై రేప్, పరిస్థితి విషమం

ఏడేళ్ల బాలిక పైన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడటంతో సదరు బాలిక ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. సరకుల కోసం దుకాణానికి వచ్చిన ఏడేళ్ల బాలికను దోమన ప్రాంతంలో ఉండే సోహన్ అలీ అపహరించి, అత్యాచారం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+