భార్యాభర్తల గొడవ: టాప్ హీరోకు నోటీసులు జారీ, వారం రోజులు, విసిగిపోయిన పోలీసులు !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో దునియా విజయ్ మీద కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు విచారణకు హాజరుకావాలని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి వారం రోజులు అయినా దునియా విజయ్ విచారణకు హాజరుకాకపోవడంతో విసిగిపోయిన పోలీసులు సీరియస్ అయ్యారు.
స్యాండిల్ హీరో దునియా విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్న కొంత కాలంగా కుటుంబ సమస్యల కారణంగా ఒకరిమీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణకు హాజరుకావాలని బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ అన్నామలై దునియా విజయ్ కు సూచించారు.

అయితే దునియా విజయ్ మాత్రం విచారణకు పోలీసుల ముందు హాజరుకాలేదు. పదేపదే హీరో దునియా విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్న పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం మొదలుపెట్టారు. హీరో దునియా విజయ్, ఆయన మొదటి భార్య నాగరత్న తీరుపై పోలీసులు విసిగిపోయారు.
ఇదే సమయంలో దునియా విజయ్, పానీపూరి కిట్టి వివాదం తెరమీదకు వచ్చింది. దునియా విజయ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరువాత హీరో దునియా విజయ్ కోర్టును ఆశ్రయించి జామీను మీద బయటకు వచ్చాడు.
మొదటి భార్య నాగరత్న ఫిర్యాదు చేసిన కేసు విచారణకు మాత్రం దునియా విజయ్ హాజరుకాలేదు. విచారణకు హాజరుకావాలని సూచించి వారం రోజులు అయినా ఎందుకు రాలేదని, కచ్చితంగా పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ డీసీపీ అన్నామలై దునియా విజయ్ కు నోటీసులు జారీ చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications