Bengaluru: మంత్రి డెవలపర్స్ సీఈవో అరెస్టు, రూ. 1,000 కోట్లు ‘మంత్రి’గారు ఏంచేశారంటే ?, ఈడీ దెబ్బతో !
బెంగళూరు/న్యూఢిల్లీ: దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన మంత్రి డెవలపర్స్ సీఇఓ, ఎండీ అయిన సుశీల్ పాండురంగ మంత్రి అలియాస్ సుశీల్ మంత్రిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు పబ్లిసిటీ ఇచ్చి ప్రజల నుంచి సుమారు రూ. 1,000 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి వాటిని తన సొంత అవసరాల కోసం వాడుకున్నారని, ప్రజలను మోసం చేశారని, అందుకే సుశీల్ మంత్రిని అరెస్టు చేశామని ఈడీ అధికారులు అంటున్నారు. బెంగళూరులో సుమారు 7 నుంచి 10 సంవత్సరాలు అయినా ప్రజలకు ఫ్లాట్లు ఇవ్వకుండా మోసం చేశారని, ఐటీ అధికారులకు పన్ను ఎగవేశారని సుశీల్ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక బ్యాంకుల నుంచి మంత్రి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో సుమారు రూ. 5,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారని ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం
బెంగళూరుకు చెందిన సుశీల్ పాండురంగ మంత్రి మంత్రి డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్నారు. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరంలో అతి పెద్ద మంత్రిమాల్ కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో మంత్రి డెవలపర్స్ కూడా ఒకటి అని అధికారులు అంటున్నారు.

ఫ్లాట్స్ ఇస్తామని డబ్బులు వసూలు
ప్రజలకు విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్ ఇస్తామని తప్పుడు పబ్లిసిటీ ఇచ్చి ప్రజల నుంచి సుమారు రూ. 1,000 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారని మంత్రి డెవలపర్స్ ఎండీ సుశీల్ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తరువాత ప్రజలకు ఫ్లాట్స్ ఇవ్వకుండా వారి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంతో విసిగిపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

బ్యాంకుల నుంచి రూ. 5 వేల కోట్లు !
వివిద బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి మంత్రి డెవలపర్స్ కొన్ని ఆస్తుల పత్రాలు ఇచ్చి సుమారు రూ. 5,000 కోట్లకు పైగా అక్రమంగా రుణాలు తీసుకుందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. బెంగళూరులో సుమారు 7 నుంచి 10 సంవత్సరాలు అయినా ప్రజలకు ఫ్లాట్లు ఇవ్వకుండా మోసం చేశారని, ఐటీ అధికారులకు పన్ను ఎగవేశారని సుశీల్ మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

‘మంత్రి’గారు అరెస్టు
మంత్రి డెవలపర్స్ అవకతవకలు, అక్రమ లావాదేవీల విషయంపై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు సుశీల్ మంత్రిని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. ఎంత ప్రశ్నించి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకోవాలని చూసిన సుశీల్ మంత్రిని అరెస్టు చేశామని, ఆయన్ను ఈడీ న్యాయాలయం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో 10 రోజులు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఈడీ అధికారులు అంటున్నారు.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications