తుఫాను ముందు ప్రశాంతత, అర్ధరాత్రి ట్రంప్ సంచలన పోస్ట్..

ప్రపంచవ్యాప్తంగా కాస్త సర్దుమణిగిందనుకున్న యుద్ధ మేఘాలు మళ్లీ ఒక్కసారిగా కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒకే ఒక్క రహస్య పోస్ట్ ఇప్పుడు ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులకు సంబంధించిన ఊహాగానాలకు తీవ్రంగా ఊతమిచ్చింది. "ఇది తుఫాను ముందు ప్రశాంతత మాత్రమే" (It was the calm before the storm) అంటూ ట్రంప్ పెట్టిన పోస్ట్ గల్ఫ్ దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, తెరవెనుక దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఈ తాజా పరిణామం నరాల తెగే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ట్రూత్ సోషల్ (Truth Social) ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ పంచుకున్న ఈ పోస్ట్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన ఒక సంచలన చిత్రం కూడా తోడైంది. ఆ ఫోటోలో ట్రంప్ ప్రసిద్ధ 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' (MAGA) టోపీ ధరించి, ఒక భారీ సైనిక నౌకపై యూఎస్ నేవీ అడ్మిరల్ పక్కన గంభీరంగా నిలబడి ఉన్నారు. వారి నేపథ్యం (బ్యాక్‌గ్రౌండ్) లో అమెరికా యుద్ధ నౌకలతో పాటు ఇరాన్ జెండాతో కూడిన నౌకలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెహ్రాన్‌ (ఇరాన్) తో దౌత్యపరమైన చర్చలు విఫలమైతే, వాషింగ్టన్ సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తోందన్న నివేదికల నడుమ ఈ ఏఐ చిత్రం సామాజిక మాధ్యమాల్లో దావానంలా వ్యాపిస్తోంది.

పెంటగాన్ 'ఆకస్మిక' ప్లాన్స్.. ట్రంప్ వార్నింగ్

మరోవైపు వైట్ హౌస్ మరియు పెంటగాన్ సీనియర్ అధికారులు ఇరాన్‌పై తిరిగి సైనిక దాడులు జరపడానికి సంబంధించిన ఆకస్మిక ప్రణాళికలపై (Contingency Plans) తీవ్రంగా చర్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తుది నిర్ణయం ఇంకా వెలువడనప్పటికీ.. ట్రంప్ మాత్రం ఇరాన్‌ను నేరుగానే హెచ్చరించారు. ఫ్రెంచ్ ప్రసార సంస్థ 'BFMTV' కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ మునుపెన్నడూ లేని విధంగా "చాలా దారుణమైన రోజులను" ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, "అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇరాన్‌కు కూడా ఆసక్తి ఉంది" అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

నా సహనం నశిస్తోంది. ట్రంప్ చైనా టూర్ ఫెయిల్?
నా సహనం నశిస్తోంది. ట్రంప్ చైనా టూర్ ఫెయిల్?

హార్ముజ్ జలసంధిపై నీలి నీడలు

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య వారాల తరబడి సాగిన భీకర ఘర్షణల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరింది. అయితే ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' లో సముద్ర భద్రత వంటి పరిష్కారం కాని అంశాలు ఉద్రిక్తతలను నిరంతరం సజీవంగా ఉంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో ఐదో వంతు (1/5th) ఈ వ్యూహాత్మక జల మార్గం నుంచే సాగుతుంది. ఒకవేళ ఇక్కడ మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం.

ట్రంప్ ఆరోగ్యం క్షీణస్తుందా? మే 26న ఏం జరగబోతుంది?
ట్రంప్ ఆరోగ్యం క్షీణస్తుందా? మే 26న ఏం జరగబోతుంది?

వాషింగ్టన్ సంకేతాలపై ఇరాన్ అప్రమత్తత

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ సైన్యం, పాలకులు తీవ్ర అప్రమత్తత ప్రకటించారు. వాషింగ్టన్ నుండి మళ్లీ చర్చలు ప్రారంభిద్దామంటూ కొన్ని సుముఖత సందేశాలు వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ధృవీకరించారు. అయినప్పటికీ, అమెరికా మాటలపై తమకున్న "తీవ్ర అవిశ్వాసం" మరియు గత అనుభవాల దృష్ట్యా తాము అడుగులు జాగ్రత్తగా వేస్తున్నామని, ఆ దేశ ఉద్దేశాలను అంత తేలికగా నమ్మలేమని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనా, ట్రంప్ పోస్ట్ చేసిన 'ఆ ఒక్క ముక్క' ప్రస్తుతం గల్ఫ్ రీజియన్‌లో ఏ క్షణంలోనైనా ఏం జరగబోతోందో అన్న భయాందోళనలను రేకెత్తిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+