మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్-2025 టైటిల్ గెలుచుకున్న సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన RCB విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు వేల సంఖ్యలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య అధికారిక ప్రకటన చేశారు. ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారని తెలిపారు. ఆస్పతుల్లో క్షతగాత్రులతో మాట్లాడిన తర్వాత ఆయన మీడియా ముందు తొక్కిసలాటకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేశారు.
•ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಐಪಿಎಲ್ ವಿಜಯೋತ್ಸವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದ ದುರಂತ ಸಂಭವಿಸಿದೆ. ಇಲ್ಲಿ ಕಾಲ್ತುಳಿತಕ್ಕೆ ಒಳಗಾಗಿ 11ಜನರು ಮೃತಪಟ್ಟು, 47 ಮಂದಿ ಗಾಯಗೊಂಡಿದ್ದಾರೆ.
— Siddaramaiah (@siddaramaiah) June 4, 2025
•ನಾನು ಬೌರಿಂಗ್ ಆಸ್ಪತ್ರೆ, ವೈದೇಹಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಗಾಯಾಳುಗಳ ಆರೋಗ್ಯ ವಿಚಾರಿಸಿ ಧೈರ್ಯ ತುಂಬಿದ್ದೇನೆ, ತಮ್ಮವರನ್ನು… pic.twitter.com/onGjKLu52V
"తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా జరగడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నాం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తాం. మరణించినవారిలో యువత ఎక్కువగా ఉన్నారు. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35వేలు అయితే దాదాపు 2 లక్షల మంది వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది" అని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఈ విషయం చాలా బాధ కలిగించింది. నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
మరోవైపు ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం చాలా బాధాకరం అని అన్నారు. వేడుకల్లో ఇంత విషాదం జరగడం చాలా దురదృష్టకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఇక ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ నెగ్గింది. దీంతో 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ జట్టును ఘనంగా సన్మానించాలని కర్ణాటక ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications