ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి టెక్కీ బ్లాక్ మెయిలింగ్

బెంగళూర్‌లో ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న సిద్ధాంత్ అమ్మాయితో స్నేహం చేశాడు, ప్రేమలేఖలు రాశాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. సిద్ధాంత్ రాజ్ శ్రీవాస్తవ అనే అతను, అమ్మాయి 2010 నుంచి 2013 వరకు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలో వారిమధ్య పరిచయం ఏర్పడింది.
బాధితురాలి నుంచి అతను ఆరు లక్షల రూపాయల వసూలు చేశాడని పోలీసులు చెప్పారు. ఆమె చేత 3.9 లక్షల రూపాయల అప్పు తీయించి, ఆ మొత్తాన్ని నిందితుడు తన భార్య ఖాతాలోకి బదిలీ చేశాడు. బాధితురాలి క్రెడిట్ కార్డుతో మరో 1.5 లక్షల రూపాయలు తీసుకున్నాడు.
తనకు వివాహమైన విషయాన్ని దాచిపెట్టి సిద్ధాంత్ హైదరాబాద్ అమ్మాయిని వలలో వేసుకున్నాడు. సిద్ధాంత్ రాజ్ వేధింపులను భరించలేక అమ్మాయి మే 21వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు సిద్ధాంత్‌ను బెంగళూర్‌లోని వసంత్‌నగర్‌లో గల ఇంట్లో అదుపులోకి తీసుకుని హైదరాబాదు తీసుకుని వచ్చారు.












Click it and Unblock the Notifications