రాష్ట్రపతి కాన్వాయ్ ను నిలిపివేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు:అంబులెన్స్ కు దారిచ్చేందకుగాను ఏకంగా రాష్ట్రపతి కాన్వాయ్ కు బ్రేకులు వేసిన ఓ ట్రాపిక్ పోలీసుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం నాడు మెట్రో గ్రీన్ లేన్ ను ప్రారంభించిందుకు బెంగుళూర్ కు వచ్చారు.రాజ్ భవన్ వైపు వెళ్తున్న ఆయన కాన్వయ్ రద్దీగా ఉండే ట్రినిటీ సర్కిల్ వద్దకు చేరుకోగానే అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ ఎంఎల్ నిజలింగప్ప ప్రణబ్ కాన్వాయ్ ను నిలిపివేశాడు.

Bengaluru traffic cop stops President’s convoy to let ambulance pass

సరిగ్గా అదే సమయంలో ట్రాఫిక్ నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఓ అంబులెన్స్ కు ట్రాఫిక్ క్లియర్ చేసి పంపించాడు. తర్వాత రాష్ట్రపతి కాన్వాయ్ కు దారిచ్చాడు.

ఈ విషయం తెలుసుకొన్న ఈస్ట్ డివిజన్ ట్రాఫిక్ డిసిపీ అభయ్ గోయల్ నిజలింగప్పపై ప్రశంసలు కురిపించాడు. భారత తొలిపౌరుడి కంటే ముందుగా అంబులెన్స్ కు దారిచ్చినందుకు నిజలింగను ప్రశంసించారు.

బెంగుళూర్ ట్రాఫిక్ పోలీసులు దారిచ్చినట్టుగానే మీరిస్తారా? అంటూ పోస్టు చేశారు. దీనిపై బెంగుళూరు సీపీ ప్రవీణ్ సూద్ కూడ వెల్ డన్ అంటూ స్పందించారు. తర్వాత కొద్దిక్షణాల్లోనే ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా నెటిజన్లు బెంగుళూరు ట్రాపిక్ పోలీసులను ప్రసంశలతో ముంచెత్తారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A policeman’s job in India is not an easy one. And though the police force is there to protect and help the citizens of this country – and they do so as well – there are times when they find themselves in a fix when dealing with VIPs.
Please Wait while comments are loading...