చావుకు ముందు సెల్ఫీ వీడియో.. బంధువులకు పంపిన క్షణాల్లోనే విషాదం!

ఆర్థిక ఇబ్బందులు, మితిమీరిన అప్పులు, విలాసవంతమైన జీవనశైలి వెరసి ఓ యువకుడు తన కుటుంబ సభ్యులనే చంపేలా ప్రేరేపించాయి. ఆ యువకుడి తప్పుడు ఆలోచన ఓ నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. బెంగళూరు శివార్లలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మాహత్యాయత్నం చేయగా.. అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనలో తల్లి, సోదరి అక్కడికక్కడే మరణించగా.. నిందితుడు, అతని మేనల్లుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దారుణ ఘటన వెనుక ఉన్న కారణాలు సామాజికంగా ఆలోచింపజేసేలా ఉన్నాయి.

విషప్రయోగం కాదు.. గొంతుకోసి దారుణం
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మోహన్ గౌడ(32) అనే యువకుడు బెంగళూరు రూరల్ పరిధిలో తన తల్లి ఆశ(55), సోదరి వర్షిత(34), ఆమె కుమారుడు మయాంక్(11)తో కలిసి నివసిస్తున్నాడు. తీవ్రమైన అప్పుల బాధ భరించలేక ఈ కుటుంబం సామూహికంగా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మోహన్ అతి కిరాతకంగా తన తల్లి, సోదరి, మేనల్లుడి గొంతులను కోశాడు. ఆపై అదే పద్ధతిలో తన గొంతును కూడా కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో ఆశ, వర్షిత అక్కడికక్కడే మరణించగా.. మోహన్, మయాంక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Bengaluru Tragedy Man Slits Family Throats Before Attempting Suicide Over Financial Debts

బంధువులకు సెల్ఫీ వీడియో.. వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ దారుణానికి ఒడిగట్టే ముందు ఆ కుటుంబ సభ్యులు ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అందులో కన్నీళ్లు పెట్టుకుంటూ వివరించారు. ఈ వీడియోను వారు తమ బంధువులకు పంపారు. వీడియో చూసి దిగ్భ్రాంతికి గురైన బంధువులు వెంటనే వారి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ నలుగురు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు.

అప్పులు ఊబికి కారణం ఇదే..
ఈ కేసును దర్యాపు చేస్తున్న బెంగళూరు రూరల్ ఎస్పీ చంద్రకాంత్ ఎంవీ ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. మోహన్ గౌడ గత కొంతకాలంగా చిట్ ఫండ్ వ్యాపారాలు చేస్తున్నాడు. సుమారు రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చిట్టీలు నడిపేవాడని.. పండగ సమయాల్లో మాంసం, టపాసుల చిట్టీలు కూడా నిర్వహించేవాడని తెలిసింది. అయితే సంపాదనకు మించి విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడటం వల్ల మోహన్ భారీగా అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

జరుగుతున్న విచారణ
ప్రస్తుతం నిందితుడు మోహన్ గౌడ, అతని మేనల్లుడు మయాంక్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు. కేవలం అప్పుల బాధేనా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ చిన్న పొరపాటు, మితిమీరిన ఆశలు ఎలా ఒక కుటుంబాన్ని నాశనం చేస్తాయనే దానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+